మేడారం మహా జాతరకు పర్యాటక శాఖ సకల ఏర్పాట్లు పూర్తి
*మేడారం మహా జాతరకు పర్యాటక శాఖ సకల ఏర్పాట్లు పూర్తి *హైదరాబాద్ నుంచి మేడారం వరకు వీ.ఐ.పీ దర్శనంతో హెలికాప్టర్ సర్వీసులు ఏర్పాటు
*జాతర కు వచ్చే వివిఐపి, వీఐపీలకు , హరిత హోటల్ లో ఏర్పాట్లు *ఆదివాసి ఛాయా చిత్ర ప్రదర్శన, పర్యాటక సమాచార కేంద్రం ఏర్పాటు
మేడారం మహా జాతరకు పర్యాటక శాఖ తరపున సకల ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కుంభమేళా వంటి మేడారం మహా జాతర లో పర్యాటక శాఖ తరఫున అనేక ఏర్పాట్లు చేయనైనది.
మేడారం మహా జాతర సందర్భంగా హైదరాబాద్ నుంచి మేడారం వరకు విఐపి దర్శనం చేయించి, మళ్ళీ హైదరాబాద్ లో దించే హెలికాప్టర్ సర్వీసులను భక్తుల సౌకర్యార్థం పర్యాటకశాఖ ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో ఈ స్థాయిలో జరిగే మరే జాతరలో కూడా ఇలాంటి హెలికాప్టర్ సర్వీసులు లేవని, మేడారం జాతరలో మాత్రం ఐదవ సారి సైతం హెలికాప్టర్ సేవలను ఏర్పాటు చేశారు.
మేడారం మహా జాతరకు వచ్చే వివిఐపీ, విఐపీల వసతి, భోజన ఏర్పాట్లను హరిత మేడారం వద్ద ఏర్పాటు చేశారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఉన్న హరిత రామప్ప , హరిత గట్టమ్మ , హరిత లక్నవరం హరిత తాడ్వాయి, హరిత భవత హోటల్ లో ఏర్పాట్లు చేయడం జరిగింది.
హరిత హోటల్ మేడారం వద్ద గల ఆదివాసి మ్యూజియం ప్రాంగణంలో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఛాయాచిత్ర ప్రదర్శన, పర్యాటక సమాచార కేంద్రం ఏర్పాటు చేశారు. హరిత గ్రాండ్ హోటల్ ప్రాంగణం లో ఆదివాసుల జీవన విధానం తెలిసే విధంగా ట్రైబల్ హట్స్ ఏర్పాటు చేశారు.
అదేవిధంగా మేడారం హరిత హోటల్ గ్రాండ్ సమావేశం మందిరంలో కేంద్ర ప్రభుత్వ టెక్స్ టైల్ మరియు హ్యాండ్లూమ్ మంత్రిత్వ శాఖ ద్వారా చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు.