అమెజాన్‌లో అన్ని భాషల్లో ట్రెండ్ అవుతున్న ‘అథర్వ’

Related image

కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరిల కాంబోలో వచ్చిన థ్రిల్లర్ మూవీ అథర్వ. క్లూస్ టీం ఆధ్వర్యంలో ఎన్నో క్రైమ్ కేసులు పరిష్కరించబడతాయి. కానీ ఇది వరకు ఎప్పుడూ కూడా క్లూస్ టీం మీద సినిమా రాలేదు. నేరస్తుడిని పట్టుకునేందుకు వారు చేసే పరిశోధన మీద ఎప్పుడూ ఓ మూవీ రాలేదు. కానీ అథర్వ టీం ఆ కోణంలోనే వచ్చింది. యూనిక్ పాయింట్‌తో వచ్చిన అథర్వకు థియేటర్లతో పాటు ఓటీటీలోనూ మంచి స్పందన వస్తోంది.


అథర్వ సినిమాను మహేష్ రెడ్డి తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుభాష్ నూతలపాటి నిర్మించారు. డిసెంబర్ 1న వచ్చిన ఈ చిత్రం థియేటర్లో మంచి సక్సెస్‌ను అందుకున్న సంగతి తెలిసిందే.

అథర్వ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25 నుంచి అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. అయితే ఈ చిత్రం తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌‌లోకి వచ్చింది. ఇప్పటికీ ఈ చిత్రం టాప్‌ 10లో ట్రెండ్ అవుతోంది. అన్ని భాషల్లో ఈ మూవీ ట్రెండ్ అవుతున్న సందర్భంగా.. హిందీలోనూ డబ్ చేయాలని చూస్తున్నారు. త్వరలోనే హిందీ భాషలో కూడా అథర్వ అందుబాటులోకి రానుంది.  ఓటీటీ ఆడియెన్స్‌ను అథర్వ ఆకట్టుకుందని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇంకా అథర్వ సినిమా ట్రెండ్ అవుతుండటంతో ఏ రేంజ్‌లో డిమాండ్ ఉందో ఊహించుకోవచ్చు.

Atharva
Tollywood
Amazon Prime
Movie News

More Press Releases