గ్రామ వార్డ్ వాలంటీర్ల సేవలకు పురస్కాల ప్రధానోత్సవం

Related image

విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయిన భాగ్యలక్ష్మి సోమవారం పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఉన్న 39 నుండి 45 డివిజన్ల వాలంటీర్లకు సేవ పురస్కారాలు  అందించారు. ఈ సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రజల క్షేమంలో వాలంటీర్ల పాత్ర ఎంతో ప్రధానమైనదని, ప్రభుత్వ సంక్షేమం పధకాలు  ప్రజలకు చేరాలంటే దానికి ముఖ్యులు, ప్రధాన పాత్రులు వాలంటీర్లు అన్నారు అందుకు వాళ్ల సేవలను గుర్తిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వై. యస్. జగన్మోహన్ రెడ్డి గారు సేవ పురస్కారాలు అందించడం ఎంతో మహోన్నతమైన విషయమని అన్నారు.  సోమవారం ఉదయం ఏడు వార్డ్   వాలంటీర్లకు సేవా మిత్రా, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలు అందించారు. 337 సేవ మిత్ర, 3 సేవ రత్న మరియు రెండు సేవ వజ్ర  మొత్తం 342 పురస్కారాలను అందించారు.


 ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ షేక్ ఆసిఫ్, 39 వ డివిజన్ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ, 40 వ డివిజన్ కార్పొరేటర్ యరడ్ల  ఆంజనేయ రెడ్డి, 41 డివిజన్ కార్పొరేటర్ మొహమద్ ఇర్ఫాన్, 42వ డివిజన్ కార్పొరేటర్ పడిగపాటి చైతన్య రెడ్డి, 43వ డివిజన్ కార్పొరేటర్  బాపతి కోటిరెడ్డి, 44వ డివిజన్ కార్పొరేటర్  మైలవరపు రత్నకుమారి, 45వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య, తదితరులు పాల్గొన్నారు.

   

Gram Ward Volunteers
Vijayawada

More Press Releases