మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి పై అధికారులతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమీక్షించారు
మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై నానక్ రామ్ గూడ హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.
మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్ తో పాటు పలు వివరాలను సీఎం కు వివరించిన అధికారులు.
మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశం..
ఇందుకు ముందుగా మూసీ క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించిన సీఎం...
నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్న సీఎం
అధికారులకు పని విభజన చేసి మూసీ నదీ పరివాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని సూచించిన సీఎం.