భారత్ లో నెదర్లాండ్స్ కింగ్ డమ్ రాయబారి మెరిసా గెరార్డ్స్ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో భేటీ

Related image

భారత్ లో  నెదర్లాండ్స్ కింగ్ డమ్ రాయబారి మెరిసా గెరార్డ్స్ బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో  భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలపై ఈ సందర్భంగా  మాట్లాడుకున్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని, అగ్రికల్చర్ సెంటర్ ఫర్ ఎక్సెలెన్స్ ఏర్పాటు, మూసీ రివర్ డెవెలప్మెంట్ ప్రాజెక్టులో భాగస్వామ్యం అంశాలు ఈ భేటీలొ ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి.  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,  ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు.

Revanth Reddy
Netherlands

More Press Releases