హైదరాబాద్ హైటెక్స్ లో కిసాన్ అగ్రి షో ను ప్రారంభించిన మంత్రి తుమ్మల

Related image

శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, గౌరవనీయులైన వ్యవసాయ, మార్కెటింగ్, సహకార మరియు చేనేత మరియు జౌళి శాఖ మాత్యులు, ఈ రోజు కిసాన్ ఫోరమ్ ప్రైవేట్ లిమిటెడ్, పూణే ఆధ్వర్యంలో 2వ సారి హైదరాబాద్ హైటెక్స్ లో నిర్వహించబడిన కిసాన్ అగ్రి షో ను ప్రారంభించడం జరిగినది. కిసాన్ ఫోరం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ ప్రదర్శన వ్యవసాయ పరికరాలు, విత్తనాలు, మరియు ఆర్గానిక్ సేంద్రీయ వ్యవసాయ ఉత్పాదకాలు మిషనరీ అన్నీ ప్రదర్శనలో ఉంచబడినవి కావున రైతులందరు ఈ ప్రదర్శనని ఉపయోగించుకోవాలి అని మనకి తెలియని విషయాలు నూతన పద్దతులు అవలంబించి పంటలు పండిస్తే దిగుబడులు తద్వారా ఎగుమతులు భాగా జరిగే అవకాశం ఉంది అని తెలియజేశారు.

వ్యవసాయ మరియు ఉద్యాన రంగములో వస్తున్న నూతన సాంకేతిక పద్దతులపై రైతులకు అవగాహనకోసం ఇక్కడ దాదాపు 120 ప్రైవేట్ స్టాల్స్, మరియు ప్రభుత్వరంగ సంస్థలు, వివిధ శాఖలు కూడా 10 వరకు ప్రదర్శనలు ఏర్పాటు చేయడం ప్రశంసనీయం అని గౌరవ మంత్రి పేర్కొన్నారు.

కావున రైతులు అందరూ కూడా ఈ ఎగ్జిబిషను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచించారు.

More Press Releases