నెక్లెస్‌ రోడ్డులో హార్టీకల్చర్, అగ్రికల్చర్ షో ను ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Related image

 తుమ్మల నాగేశ్వరరావు, గౌరవనీయులైన వ్యవసాయ, మార్కెటింగ్, సహకార మరియు చేనేత మరియు జౌళి శాఖ మాత్యులు, ఈ రోజు నెక్లెస్‌ రోడ్డులో హార్టీకల్చర్, అగ్రికల్చర్ షో ప్రారంబించారు. తెలంగాణ ఈవెంట్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1 నుంచి ఐదు రోజుల పాటు 15వ గ్రాండ్ నర్సరీ మేళా కొనసాగుతుంది.

నేడు మొక్కలు నాటడం అంటే రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వడమేనని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

ఈ నర్సరీ మేళాలో రంగు రంగుల పూలమొక్కలు, మెడిసినల్‌ ప్లాంట్స్‌, దేశవ్యాప్తంగా వివిధ నర్సరీల నుంచి వచ్చిన్న ఇంపోర్టెడ్ ప్లాంట్స్, టిష్యూ కల్చర్ మొక్కలు, హార్టీకల్చర్‌ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయల తోటలు, ఎరువులు, ఆర్గానిక్ ఉత్పత్తులు, అగ్రికల్చర్ ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ సైన్స్, ఎడ్యుకేషన్, ఫుడ్ ఇండస్ట్రీ ఉత్పత్తులను సందర్శించారు.

హైడ్రోఫోనిక్, టెర్రస్ గార్డెనింగ్, వర్టీకల్ గార్డెనింగ్ వంటి నూతన టెక్నాలజీ మరియు ప్రధానంగా వెస్ట్‌ బెంగాల్‌లోని డార్జిలింగ్, కోల్ కతా, ఢిల్లీ, హర్యానా, ముంబయి, బెంగుళూరు, పూణే, షిర్డీ, కడియం, చెన్నై తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల నుంచి వచ్చిన 160కు పైగా నర్సరీ స్టాల్స్ ద్వారా ఈ షోలో ప్రదర్శిస్తున్న, పూల మొక్కలు, మెడిసినల్ ప్లాంట్స్, హార్టికల్చర్, ఉత్పత్తులు మరియు ఆర్గానిక్ ఎరువులు రైతులకు మరియు నగరవాసులకు ఉపయోగపడే విధంగా ఉన్నాయని, ఈ నర్సరీ మేళాను నగర వాసులకు అందుబాటులోకి తీసుకు వచ్చినందుకు మేళ నిర్వహకులను మంత్రి గారు అభినందించారు.

More Press Releases