ప్రభుత్వ సలహాదారుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన హర్కర వేణుగోపాల్ రావు

Related image

హైదరాబాద్, ఫిబ్రవరి 1 : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా హార్కర వేణు గోపాలరావు నేడు పదవీ బాధ్యతలను స్వీకరించారు. బి.అర్.అంబేడ్కర్ సచివాలయంలో తన కార్యాలయంలో వేదపండితులు నిర్వహించిన పూజల అనంతరం పదవీ భాద్యతలను స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్, ప్రజాసంబంధాల సలహాదారుగా పదవీ భాద్యతలు స్వీకరించిన హర్కర వేణుగోపాల్ రావును రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ కమీషన్ చైర్మన్ కృష్ణ మోహన్ రావు, జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావు, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ అశోక్ రెడ్డి, మాజీ ఎంపీలు వీ హనుమంత రావు, సుబ్బరామిరెడ్డి, మధు యాష్కీ, దీపా దాస్ తదితర ప్రజాప్రతినిధులు పూల గుచ్చాలతో అభినందించారు.

   

Harkara Venugopal Rao
Telangana

More Press Releases