ఫొటోలు:- ఆస్ట్రేలియన్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా ఫిలిప్ గ్రీన్ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు
ఫొటోలు:- ఆస్ట్రేలియన్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా ఫిలిప్ గ్రీన్ మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలంగాణలో విద్య అభివృద్ధి కార్యక్రమాలు, ఎకో టూరిజం విస్తరణకు ఉన్న అవకాశాలు, వ్యవసాయంలో అధునాతన సాంకేతిక విధానాలపైనా ఇరువురి మధ్య కాసేపు చర్చ జరిగింది. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు డైరెక్ట్ కనెక్టివిటీ మెరుగు పడాలని అభిలషించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ సందర్భంగా సీఎం వెంట ఉన్నారు.