వారసత్వాన్ని ఆవిష్కరణతో మిళితం చేసి రామ్ మందిర్ మరియు రామ్ పథ్ ను అలంకార ప్రాయమైన వీధి దీపాలతో వెలిగించిన సిగ్నిఫై
• 'మేక్ ఇన్ ఇండియా, ఫర్ ఇండియా' బ్రాండ్ నిబద్ధతకు అనుగుణంగా అయోధ్య కోసం ప్రత్యేకంగా లైట్స్ ను తీర్చిదిద్దింది
• రామమందిరంలోని ముఖ్యమైన ప్రాంతాలలో దీపాలను వెలిగించడం ద్వారా భారతదేశ వారసత్వానికి జోడించిన సిగ్నిఫై మరియు రామ్ పథ్ లో 110 ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఫిలిప్స్ అలంకార స్తంభాలను ఏర్పాటు చేసింది.
ఇండియా - దేశంతో పాటుగా చారిత్రాత్మకమైన అడుగులు వేస్తూ, లైటెనింగ్ లో ప్రపంచ అగ్రగామి అయిన సిగ్నిఫై (Euronext: LIGHT), అనుకూలీకరించిన అలంకారమైన మరియు ఫంక్షనల్ లైట్లతో రామ్ పథ్ మరియు రామ మందిరం లోని పలు ప్రాంతాలను ప్రకాశింప జేస్తున్నట్లు వెల్లడించింది. కాంతి యొక్క అసాధారణ సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడంపై దృష్టి సారించిన సిగ్నిఫై అయోధ్య యొక్క సాంస్కృతిక వారసత్వానికి తోడ్పడటం పట్ల గర్విస్తుంది.
గ్రేటర్ ఇండియా సిగ్నిఫై, సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ బిజినెస్ హెడ్ వికాస్ మల్హోత్రా ఈ అసాధారణమైన ప్రాజెక్ట్ పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, "అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి సంఘటన. మా ప్రత్యేక శ్రేణి లైట్లు ద్వారా అయోధ్య యొక్క ప్రకృతి దృశ్యానికి మరిన్ని సొబగులు అద్దడం ఒక గౌరవంగా భావిస్తున్నాము. సిగ్నిఫై వద్ద, మా సాంకేతికత, ఆవిష్కరణ మరియు అనుకూలీకరణ కోసం మేము ఎల్లప్పుడూ లైటింగ్ పరిశ్రమలో ముందంజలో ఉంటాము. రామ మందిరం, రామ్ పథ్ లో మా లైటింగ్ డిజైన్‌లు వారసత్వం మరియు అత్యాధునిక సాంకేతికత యొక్క సామరస్య సమ్మేళనం గా నిలుస్తాయి. , ఇవి భగవాన్ రామ్ విజయం యొక్క స్ఫూర్తిని ఒడిసిపట్టడం తో పాటుగా దైవిక ప్రయాణాన్ని గౌరవించే ప్రాంగణాన్ని ప్రకాశవంతం చేయడం మరియు దాని ప్రత్యేక వారసత్వాన్ని వేడుక చేసుకోవడం చేస్తాయి " అని అన్నారు.
అత్యాధునిక లైటింగ్ సొల్యూషన్స్‌తో రామ్ మందిర్ దేవాలయం
దేవాలయం యొక్క పెర్కోటా లైటింగ్ కోసం, ఫిలిప్స్ యూని ఫిక్చర్‌లు వ్యూహాత్మకంగా గోడలు, స్తంభాలు మరియు పైకప్పులపై ఉంచబడ్డాయి. ఈ ఫిక్చర్‌లు, పరిమాణంలో తెలివిగా ఎంపిక చేయటం వల్ల , కాంతి మూలం భక్తులకు దాదాపు కనిపించకుండా వుంటూనే వారి మార్గం కాంతివంతం చేసింది, మిరుమిట్లు గొలిపే కాంతిని తగ్గించడంతోపాటు ప్రకాశవంతమైన మరియు ఉత్సాహపూరితమైన వాతావరణాన్ని అందిస్తుంది. వారి నిర్దిష్ట పుంజం కోణంలో ఒక ప్రత్యేకమైన ప్రతిపాదన ఉంది, ఇది ఆలయం యొక్క క్లిష్టమైన శిల్పాలను నైపుణ్య వంతంగా ప్రకాశింపజేస్తుంది. ఆలయ ల్యాండ్‌స్కేప్ లైటింగ్ పరిసరాలను మంత్రముగ్ధులను చేసే దృశ్యంగా మారుస్తుంది. స్టెప్ లైట్లు, ప్రొఫైల్‌లతో LED స్ట్రిప్స్ మరియు పోస్ట్ టాప్స్ మరియు ఇన్‌గ్రౌండ్ అప్-లైటర్స్ వంటి డెకరేటివ్ ఫిక్చర్‌ల సమ్మేళనాన్ని ఉపయోగించి, మేము ర్యాంప్‌లు మరియు శిల్పాలను కళాత్మకంగా ప్రకాశింప జేశాము. ప్రతి ఫిక్చర్ ప్రాజెక్ట్ ప్రమాణాలకు అనుగుణంగా అనుకూలీకరించబడింది, పవిత్రమైన ప్రాంగణానికి తగినట్లుగా ఆకర్షణీయమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. కుబేర్ తిలాపై మా ల్యాండ్‌స్కేప్ లైటింగ్, ఆలయ వైభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది, నిర్మాణ అద్భుతంతో సజావుగా ఇది కలిసిపోతుంది. పిల్‌గ్రిమ్ ఫెసిలిటీ సెంటర్‌లో, మా ఇండోర్ లైటింగ్ ఫిక్చర్‌లు తీర్థయాత్ర ల అనుభవాన్ని పునర్నిర్వచించాయి, సౌందర్యంతో కార్యాచరణను సమ్మిళితం చేసుకున్నాయి. మేము ఈ ప్రయత్నాలలో పని చేస్తూనే ఉన్నందున, రామమందిరం ఆలయంలోని ప్రతి మూలకు తేజస్సును తీసుకురావడానికి మేము కట్టుబడి ఉన్నాము, అందరికీ దైవిక మరియు జ్ఞానోదయమైన వాతావరణాన్ని నిర్ధారిస్తాము..." అని అన్నారు.
రామ్ పథ్ - ధరమ్ పథ్ గేట్ నుండి రామమందిరానికి దారితీసే ప్రధాన మార్గం
కస్టమైజ్ చేయబడిన అలంకార స్తంభం ప్రత్యేకమైనది మరియు గంభీరమైన ఫిలిప్స్ యూని అర్బన్ లైటింగ్ ఫిక్చర్. ఇది భగవాన్ రామ్ యొక్క ప్రతిష్టాత్మకమైన విల్లు మరియు బాణాన్ని ప్రతిబింబించేలా రూపొందించబడిన టాప్ బ్రాకెట్‌ను కలిగి ఉంటుంది. నూతనంగా ఆవిష్కరించబడిన పోల్ పురాణంలో అంతర్లీనంగా ఉన్న భగవాన్ రామ్ యొక్క విజయం మరియు ఆ స్ఫూర్తిని సూచిస్తూ నగరం యొక్క సౌందర్య ఆకర్షణను పెంచుతుంది. ప్రత్యేకమైన ఇన్‌స్టాలేషన్ దాని గ్రాండ్ డిజైన్‌తో వాస్తవికతను జోడిస్తూ , గంభీరమైన లైటింగ్ ఫిక్చర్‌ను ప్రదర్శిస్తుంది. భగవాన్ రామ్ యొక్క విల్లు మరియు బాణాన్ని అనుకరించేలా పూర్తిగా రూపొందించబడిన టాప్ బ్రాకెట్ వరకు సంక్లిష్టత విస్తరించింది. డిజైన్‌లోని ఖచ్చితత్వం నుండి సాంస్కృతిక ప్రతీకవాదాన్ని ఆలోచనాత్మకంగా చేర్చడం వరకు ప్రతి సూక్ష్మ అంశమూ అత్యంత జాగ్రత్తగా పరిశీలించబడ్డాయి. స్తంభం దిగువన రాముడు మరియు హనుమంతుని అందమైన చిత్రాలు ఉన్నాయి. ఈ వినూత్న ఇన్‌స్టాలేషన్‌లు అధిక విద్యుత్ పొదుపు సామర్ధ్యం కలిగి ఉంటాయి మరియు అత్యాధునిక LED లైటింగ్‌ను ప్రదర్శిస్తాయి.
ధరంపథ్ గేట్ మరియు సూర్య స్తంభ ద్వారం
ధరంపత్ గేట్ మరియు సూర్య స్తంభ్ గేట్ కోసం ముఖభాగం లైటింగ్‌ను కూడా సిగ్నిఫై చేసింది, దాని నిర్మాణ లక్షణాలను మరియు అపారమైన నిర్మాణాన్ని ఇది ఎలివేట్ చేస్తోంది. ఇది అయోధ్య యొక్క నైట్‌స్కేప్‌ల దృశ్యమాన ఆకర్షణను పెంచడమే కాకుండా స్థిరమైన లైటింగ్ పరిష్కారాల పట్ల సిగ్నిఫై యొక్క అంకితభావాన్ని కూడా నొక్కి చెబుతుంది.
గతంలో, సిగ్నిఫై హనుమాన్ గర్హి, కనక్ భవన్, దశరథ్ మహల్ మరియు దిగంబర్ అఖాడా వంటి ముఖ్య మైన ప్రాంతాల కోసం లైటింగ్‌ను చేసింది, DMX నియంత్రణలతో కూడిన అధునాతన ఫిలిప్స్ యుని శ్రేణి ఉత్పత్తులను ఉపయోగించుకుంది. ఈ వినూత్నమైన మరియు స్థిరమైన లైటింగ్ సొల్యూషన్స్ ద్వారా, సిగ్నిఫై అయోధ్యలోని సందర్శకులు మరియు స్థానిక నివాసితులపై శాశ్వత ప్రభావాన్ని చూపాలని కోరుకుంటుంది, ఇది బాగా వెలుతురు మరియు సుందరమైన పట్టణ వాతావరణానికి దోహదం చేస్తుంది.-