ఫారెస్ట్ అధికారుల పైన దాడినీ తీవ్రంగా ఖండించిన: కొండా సురేఖ

Related image

భద్రాద్రి జిల్లా ఇల్లందు ఫారెస్ట్ డివిజన్ రేంజ్ పరిధి లోని అటవీ ప్రాంతం నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న మాఫియా ను అడ్డుకునేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారుల పైన ట్రాక్టర్ తో ఎక్కించి చంపడానికి చేసిన కుట్రలను అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు..

ఈ ఘటనలో దోషులు ఎంతటి వారైనా ఉపెక్షించం.. కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.. సంభందిత అధికారులతో మంత్రి ఫోన్ లో జరిగిన ఘటన అడిగి తెలుసుకున్నారు..

ప్రజా ప్రభుత్వం లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అదేవిదంగా జరిగిన ఘటన ను పూర్తిగా విచారణకు ఆదేశించారు.. అటవీ ప్రాంతం లో గతంలో జరిగిన దాడుల దృష్ట్యా అధికారులు ఎల్లపుడూ అప్రమత్తంగా ఉంటు, ఎలాంటి సహాయసహకారాలు కావాలన్న మా దృష్టికి తీసుకురావాలని అన్నారు..

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామం.. అవసరం అవుతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకువచ్చి ఎలాంటి చర్యలు తీసుకోవాలో వాటిని త్వరలోనే వెల్లడిస్తామని అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖమంత్రి అన్నారు.

More Press Releases