'ఆ ఒక్కటీ అడక్కు- మూవీ రివ్యూ
- అల్లరి నరేశ్ హీరోగా వచ్చిన 'ఆ ఒక్కటీ అడక్కు'
- ఆయన బాడీ లాంగ్వేజ్ ను పక్కనపెట్టిన కంటెంట్
- టైటిల్ తో సంబంధం లేని కథ ఇది
- ప్రధానమైన సమస్య చుట్టూ పరిగెత్తని కామెడీ
- సమస్యలోని వినోదాన్ని వదిలి పరిష్కారం దిశగా వెళ్లడమే లోపం
'అల్లరి' నరేశ్ ఆ మధ్య కొత్తదనం పేరుతో సీరియస్ కథలను ఎంచుకుంటూ వెళ్లాడు. రీసెంటుగా మనసు మార్చుకుని, మళ్లీ కామెడీ కంటెంట్ వైపు వచ్చాడు. అలా ఆయన చేసిన సినిమానే 'ఆ ఒక్కటీ అడక్కు'. మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. అల్లరి నరేశ్ నుంచి మళ్లీ కామెడీ కంటెంట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన ప్రేక్షకులకు ఈ సినిమా ఏ స్థాయిలో నవ్వులు పంచిందనేది ఇప్పుడు చూద్దాం.
ఈ కథ వైజాగ్ లో మొదలవుతుంది. గణపతి (అల్లరి నరేశ్) ఓ ప్రభుత్వ సంస్థలో పనిచేస్తూ ఉంటాడు. తల్లి .. తమ్ముడు .. మరదలు .. వారి పాప. ఇది అతని కుటుంబం. తండ్రిలేని కుటుంబాన్ని ఓ దారికి తీసుకుని వచ్చేసరికి, అతనికి పెళ్లి వయసు దాటిపోతుంది. అందువల్లనే అతను తమ్ముడికి పెళ్లి చేస్తాడు. అన్నలో ఏం లోపముందో అనే అనుమానంతో అసలు సంబంధాలు రావడమే మానేస్తాయి. దాంతో అతనికి ఇక పెళ్లి కాలేదేమో అనే బెంగతో తల్లి ఉంటుంది.
తల్లిని బాధపెట్టడం ఇష్టం లేక అతను ఓ మ్యాట్రిమోనీని ఆశ్రయిస్తాడు. వాళ్ల ప్యాకేజీలలో తనకి నచ్చిందానిని ఎంపిక చేసుకుంటాడు. ఆ ఫ్లాట్ ఫామ్ పై అతనికి సిద్ధి (ఫరియా అబ్దుల్లా) తారసపడుతుంది. సిద్ధీని చూడగానే ఆమెను పెళ్లి చేసుకోవాలని గణపతి ఫిక్స్ అవుతాడు. అయితే ఆమె మాత్రం తన అభిరుచులకు .. అభిప్రాయాలకు .. లైఫ్ స్టైల్ కి అతను చాలా దూరంగా ఉన్నట్టుగా చెబుతుంది. అయినా ఆమెను గణపతి ఆరాధిస్తూనే ఉంటాడు.
అయితే సిద్ధి పరిచయం కావడానికి ముందే ఆమె తండ్రి ఒక ప్రమాదానికి గురవుతాడు. తన ప్రమాదానికి కారకుడు గణపతి అనే ఆలోచనలోనే ఆమె తండ్రి ఉంటాడు. అతని హాస్పిటల్ కి అవసరమైన డబ్బు కోసం, మ్యాట్రిమోనీ వారు తమ బిజినెస్ పరంగా ఆడే ఒక నాటకంలో .. ఒక్క మాటలో చెప్పాలంటే మోసంలో సిద్ధీ భాగమవుతుంది. అయితే గణపతి పెళ్లి గురించి ఆలోచిస్తూ అనారోగ్యం పాలైన అతని తల్లి కోలుకోవడం కోసం, అతణ్ణి తాను పెళ్లి చేసుకోనున్నట్టుగా ఆమె అబద్ధం ఆడుతుంది.
గణపతికి చక్కని పిల్ల దొరికింది. ఇక తనకి ఏ బెంగా లేదని తల్లి అనుకుంటూ ఉండగానే, మ్యాట్రిమోనీ ద్వారా సిద్ధీ చేస్తున్న మోసాలను గురించి గణపతికి తెలుస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? అతను తీసుకునే నిర్ణయం ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుంది? సిద్ధీ ఆడుతూ వచ్చిన నాటకం .. ఆమె తండ్రి ప్రమాదంలో గణపతి ప్రమేయం వారిని పెళ్లి పీటల దిశగా అడుగులు వేయిస్తాయా? అనేది మిగతా కథ.
అల్లరి నరేశ్ .. కామెడీ కంటెంట్ ను మొదటి నుంచి చివరివరకూ నాన్ స్టాప్ గా నడిపించగల సమర్థుడు అనడానికి అతను చేసిన 60 సినిమాలే ఉదాహరణ. అలాంటి నరేశ్ నుంచి ఒక సినిమా వస్తుందంటే, ఆ స్థాయిలో కామెడీ ఉంటుందని అనుకోవడం సహజం. ఇక గతంలో తన తండ్రి దర్శకత్వంలో వచ్చిన 'ఆ ఒక్కటీ అడక్కు' టైటిల్ పైనే ఈ సినిమా వచ్చింది. అందువలన కూడా ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మరి టైటిల్ కి తగిన వినోదం ఈ సినిమాలో ఉందా అంటే లేదనే చెప్పాలి.
ఈవీవీ 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమా చూస్తే, ఆ సినిమాకి ఆ టైటిల్ తప్ప మరొకటి సెట్ కాదని అనిపిస్తుంది. అదే ఈ సినిమా విషయానికి వచ్చేసరికి, అసలు ఈ సినిమాకి ఈ టైటిల్ ఎందుకు పెట్టారా అనేది అర్థం కాదు. అలాంటి అయోమయం కలుగుతుందనే విషయం వారికి కూడా అర్థమైంది కనుకనే, ఒకటీ రెండు సార్లు టైటిల్ డైలాగ్ ను చెప్పించారు. సినిమా మొదలైన కొంతసేపటి వరకూ, ఇక అసలు కథలోకి వెళ్లిపోతామని సగటు ప్రేక్షకుడు అనుకుంటాడు. కానీ జరుగుతున్నదే అసలు కథ అనే విషయం అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. అర్థమై తేరుకోవడానికి మిగతా సమయం పడుతుంది.
దర్శకుడు ప్రధానమైన కథాంశాన్ని సరిగ్గా రాసుకోలేదు. ఒక బలమైన సమస్య చుట్టూ దానికి ఇంట్రెస్టింగ్ గా తిప్పలేదు. టైటిల్ కి తగిన వినోదం .. అల్లరి నరేశ్ బాడీ లాంగ్వేజ్ కి తగిన కామెడీని గాని వర్కౌట్ చేయలేకపోయాడు. వెన్నెల కిశోర్ .. వైవా హర్ష వైపు నుంచి కూడా కామెడీని పిండలేకపోయారు. జామీ లీవర్ కాస్త కామెడీ చేయడానికి ట్రై చేసిందిగానీ .. ఆ మార్క్ కామెడీ మన ఆడియన్స్ కి అంతగా అతకదు. కథలో ఉన్న కాస్త ఎమోషన్ కూడా కనెక్ట్ కాదు.
'అల్లరి' నరేశ్ తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కామెడీలో నుంచి బయటికి వచ్చినట్టుగా కనిపిస్తాడు. ఫరియా ఎప్పటిలానే అందంగా కనిపించింది. ఈ రెండు పాత్రల మినహా మిగతా పాత్రలేవీ చెప్పుకోదగినవిగా కనిపించవు. కథ వినోదానికి దూరంగా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. గోపీ సుందర్ బాణీలు ఓ మాదిరిగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం ఫరవాలేదు. సూర్య ఫొటోగ్రఫీ .. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ ఓకే.
అల్లరి నరేశ్ మార్క్ కామెడీని ఆడియన్స్ ఎప్పటి నుంచో ఇష్టపడుతూ వస్తున్నారు. కొంత గ్యాప్ తరువాత ఆయన మళ్లీ కామెడీ వైపు రావడం అభిమానులకు సంతోషాన్ని కలిగించే విషయమే. అయితే కథలో సమస్య ఏదైనా అది తన మార్క్ కామెడీని కలుపుకుని తిరుగుతుందా లేదా అనేది చూసుకుంటే బాగుండేది. హీరో పెళ్లికుదరకపోవడం అనే అంశం చుట్టూ కామెడీని నడిపిస్తే వర్కౌట్ అయ్యేది. కానీ ఆ అంశాన్ని సమస్యగా మార్చి .. పరిష్కారం చూపించడానికి చేసిన ప్రయత్నమే మైనస్ గా మారిందని చెప్పక తప్పదు.

Movie Name: Aa Okkati Adakku
Release Date: 2024-05-03
Cast: Alari Naresh, Faria Abdullah, Vennela Kishore, Jamie Lever,Harsha Chemudu
Director: Malli Ankam
Producer: Rajiv Chilaka
Music: Gopi Sundar
Banner: Chilaka Productions
Review By: Krishna
Aa Okkati Adakku Rating: 2.00 out of 5
Trailer