'కిల్లర్ సూప్' (నెట్ ఫ్లిక్స్) వెబ్ సిరీస్ రివ్యూ
- బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా 'కిల్లర్ సూప్'
- 8 ఎపిసోడ్స్ గా జరుగుతున్న స్ట్రీమింగ్
- ద్విపాత్రాభినయం చేసిన మనోజ్ బాజ్ పాయ్
- ఆసక్తిని రేకెత్తించే కథాకథనాలు
- సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించిన సన్నివేశాలు
వెండితెరపై మనోజ్ బాజ్ పాయ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఇక ఆయన చేసిన వెబ్ సిరీస్ లు కూడా విశేషమైన ఆదరణ పొందాయి. మనోజ్ బాజ్ పాయ్ నుంచి ఒక వెబ్ సిరీస్ వస్తుందంటే, ఆ కథలో తప్పకుండా విషయం ఉండే ఉంటుందనే ఒక నమ్మకం ఆడియన్స్ కి కలిగింది. దాంతో ఆయన వెబ్ సిరీస్ ల పట్ల మరింత ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ద్విపాత్రాభినయం చేసిన వెబ్ సిరీస్ గా 'కిల్లర్ సూప్' నెట్ ఫ్లిక్స్ ద్వారా నిన్నటి నుంచి అందుబాటులోకి వచ్చింది.
కథలోకి వెళితే .. అరవింద్ శెట్టి ( సాయాజీ షిండే) ప్రభాకర్ శెట్టి ( మనోజ్ బాజ్ పాయ్) అన్నదమ్ములు. అరవింద్ కి వివాహమవుతుంది. భార్యను కోల్పోయిన ఆయన, కూతురు 'ఆపేక్ష'ను గారంగా పెంచుతాడు. ఇక ప్రభాకర్ కి స్వాతి (కొంకణా సేన్ శర్మ)తో వివాహమవుతుంది. వారి ఒక్కగానొక్క సంతానమే శాండీ. అటు అరవింద్ కూతురు .. ఇటు ప్రభాకర్ కొడుకు టీనేజ్ కి చేరుకుంటారు. అరవింద్ ఏ బిజినెస్ మొదలెట్టినా కలిసొస్తుంది. ప్రభాకర్ తాను మొదలుపెట్టిన ప్రతి వ్యాపారంలో నష్టపోతూ వస్తాడు.
వ్యాపారంలో నష్టాలు రావడంతో సహజంగానే ప్రభాకర్ దంపతుల మధ్య గొడవలు మొదలవుతాయి. అతను ఇంటికి ఎక్కువగా రాకుండా క్లబ్బులలో .. పబ్బులలో కాలం గడిపేస్తూ ఉంటాడు. ఈ సమయంలోనే అచ్చు తన భర్తను పోలిన ఉమేశ్ (మనోజ్ బాజ్ పాయ్)తో స్వాతికి పరిచయం ఏర్పడుతుంది. అతను ఓ మసాజ్ సెంటర్ లో మసాజ్ లు చేస్తుంటాడు. అతనికి ఒక కన్ను మెల్ల. అయినా స్వాతి అతనికి దగ్గరవుతుంది. ఇద్దరి మధ్య రహస్య సంబంధం కొనసాగుతూ ఉంటుంది.
ఈ నేపథ్యంలో అరవింద్ అప్పగించిన పనుల్లో అక్రమాలకు పాల్పడుతూ 31 కోట్ల రూపాలను ప్రభాకర్ కొట్టేస్తాడు. అయితే అందుకు సంబంధించి ఒక అజ్ఞాత వ్యక్తి ప్రభాకర్ ను బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజుతూ ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరో తెలియక ప్రభాకర్ సతమతమవుతున్న సమయంలోనే, స్వాతి - ఉమేశ్ అతనికి దొరికిపోతారు. దాంతో ఆ ఇద్దరిపై దాడి చేయడానికి ప్రయత్నించి, ఆ పెనుగులాటలో తాను చనిపోతాడు. ఊహించని ఈ సంఘటనతో స్వాతి - ఉమేశ్ బిత్తర పోతారు.
ఇద్దరూ కలిసి ఒక రాత్రి వేళ ప్రభాకర్ శవాన్ని ఫారెస్టు ప్రాంతానికి తీసుకుని వెళ్లి అక్కడ గొయ్యితీసి పాతిపెడతారు. ప్రభాకర్ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం కలగకుండా ఉండటం కోసం, ఉమేశ్ ను ప్రభాకర్ గా మార్చేయాలని స్వాతి నిర్ణయించుకుంటుంది. ఉమేశ్ కంటికి గాయం కావడం వలన, అతని మెల్లకన్నును గుర్తించే అవకాశం లేకుండా పోతుంది, అలా తనతో ఉన్నది ప్రభాకర్ అనే స్వాతి అందరినీ నమ్మిస్తూ వస్తుంటుంది.
అయితే ప్రభాకర్ చనిపోవడానికి ముందు, తనని బ్లాక్ మెయిల్ చేస్తున్నది ఎవరనే విషయం తెలుసుకునే పనిని కిరణ్ నాడార్ అనే ప్రైవేట్ డిటెక్టివ్ కి అప్పగిస్తాడు. కిరణ్ నాడార్ కి ఉమేశ్ పై అనుమానం కలుగుతుంది. ఆ పరిశోధనలోనే స్వాతితో ఉమేశ్ కి ఉన్న రహస్య సంబంధం గురించి తెలుస్తుంది. అతని కెమెరాలో ఉన్న ఆధారాలను స్వాతి లాక్కునే సమయంలో అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఆ డిటెక్టివ్ చనిపోతాడు. ఆ కేసులో ఉమేశ్ కోసం పోలీస్ ఆఫీసర్ హసన్ (నాజర్) తుపాలి గాలిస్తుంటారు.
అలా ఆ కేసుకు సంబంధించిన ఆధారాల కోసం వెదుకుతున్న తుపాలికి, ప్రభాకర్ మర్డర్ విషయం .. దాని వెనుక ఉమేశ్ - స్వాతి హస్తం ఉందనే సంగతి అర్థమవుతుంది. ఆ విషయాన్ని అతను హసన్ కి చెప్పడానికి ట్రై చేస్తూనే చనిపోతాడు. తుపాలి చివరిసారిగా తన బైక్ ను పార్కు చేసిన దగ్గర నుంచి, హసన్ తన అన్వేషణ మొదలుపెడతాడు. అతని అన్వేషణ ఎంతవరకూ ఫలిస్తుంది? చట్టానికి దొరక్కుండా ఉండటానికి స్వాతి - ఉమేశ్ ఎలాంటి ప్లాన్స్ వేస్తారు? ప్రభాకర్ చేసిన మోసం గురించి తెలిసిన అరవింద్ ఏం చేస్తాడు? అనేది మిగతా కథ.
ఉనైజా మర్చెంట్ .. అనంత్ త్రిపాఠి .. హర్షద్ నలవాడ ఈ కథను తయారు చేశారు. ఒక వైపున అరవింద్ - ఓ వైపున ప్రభాకర్ .. మరో వైపున స్వాతి - ఉమేశ్, ఇంకో వైపున పోలీస్ ఆఫీసర్ హసన్ ట్రాకులను చాలా ఆసక్తికరంగా ముందుకు తీసుకుని వెళ్లారు. అభిషేక్ చౌబే ఈ కథను అంతే ఉత్కంఠభరితంగా తెరపైకి తీసుకుని వచ్చాడు. ప్రతి పాత్రను డిజైన్ చేసిన తీరు .. ఆ పాత్రలను నడిపించిన విధానం .. ప్రతి ఎపిసోడ్ ఆ తరువాత ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతూ వెళుతుంది.
సన్నివేశాలకి తగిన లొకేషన్స్ .. సన్నివేశాలను పకడ్బందీగా ఆవిష్కరించిన పద్ధతి కారణంగా, నిడివి ఎక్కువే అయినా అలా అనిపించదు. సీనియర్ ఆర్టిస్టులు కావడం వలన .. సన్నివేశాలకు సహజత్వాన్ని తీసుకొచ్చారు. అనువాదం కూడా బాగానే కుదిరింది. నిర్మాతలు చేతన్ కౌశిక్ - హానీ తెహ్రాన్ నిర్మాణ విలువల విషయంలో రాజీ పడలేదనే విషయం అర్థమవుతూనే ఉంటుంది. సందేశ్ రావు నేపథ్య సంగీతం .. అనూజ్ రాకేశ్ ఫొటోగ్రఫీ ఈ కథకు మరింత బలాన్ని ఇచ్చాయి. శాన్యుక్త కాజా ఎడిటింగ్ వర్క్ కూడా నీట్ గా ఉంది.
బలమైన కథాకథనాలు .. ఆసక్తికరమైన మలుపులు .. సహజత్వానికి దగ్గరగా అనిపించే సన్నివేశాలు ఈ సిరీస్ ఆకట్టుకోవడంలో ప్రధానమైన పాత్రను పోషించాయని చెప్పాలి. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ను ఎక్కువగా ఇష్టపడేవారు ఈ సిరీస్ ను చూడొచ్చు.

Movie Name: Killer Soup
Release Date: 2024-01-12
Cast: Manoj Bajpayee, Konkona Sen Sharma, Nassar, Sayaji Shinde, Lal
Director: Abhishek Chaubey
Producer: Chetana Kowshik - Honey Trehan
Music: Sandesh Rao
Banner: Macguffin Pictures
Review By: Peddinti
Killer Soup Rating: 3.00 out of 5
Trailer