'డెవిల్' - మూవీ రివ్యూ
- కల్యాణ్ రామ్ హీరోగా రూపొందిన 'డెవిల్'
- 1945 నేపథ్యంలో నడిచే కథ
- వన్ మేన్ ఆర్మీగా కనిపించే కల్యాణ్ రామ్
- పెర్ఫెక్ట్ గా అనిపించే మెయిన్ లైన్
- తక్కువగా అనిపించే వినోదం పాళ్లు
- ఫైట్స్ .. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం హైలైట్
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయానికి సంబంధించిన అంశాలు .. ఆనాటి పరిస్థితులకు కల్పితాలు జోడిస్తూ గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. అలా సుభాష్ చంద్రబోస్ కి సంబంధించిన నేపథ్యంలో సాగే కథగా 'డెవిల్' సినిమా రూపొందింది. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమా, ఆడియన్స్ కి ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది ఇప్పుడు చూద్దాం.
ఈ కథ 1945లో మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతంలో నడుస్తుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియాలో అడుగుపెడితే ఆయనను పట్టుకోవడానికి ఆంగ్లేయ అధికారులు సిద్ధంగా ఉంటారు. నేతాజీ చుట్టూ ఒక రక్షణ కవచంగా 'త్రివర్ణ' ఉంటుంది. తాను ఇండియాలో ఎప్పుడు ఎక్కడ ల్యాండ్ కావాలనే విషయాలను గురించి త్రివర్ణతో కోడ్ భాషలో నేతాజీకి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూనే ఉంటాయి. అలా నేతాజీకి రహస్యంగా సమాచారాన్ని అందించే సీక్రెట్ ఏజెంట్లపై బ్రిటిష్ అధికారులు నిఘా పెడతారు.
ఇదిలా ఉండగా .. 'రాసపాడు' గ్రామానికి మృత్యుంజయవర్మ జమీందారుగా ఉంటాడు. ఆయన కూతురు విజయ (అమ్ము అభిరామి) ఆ ఇంటి పనివాడైన 'భూమా'తో సాన్నిహిత్యంగా ఉంటుంది. ఈ విషయాన్ని గమించిన పట్వారి (అజయ్) జమీందారుకి చెబుతాడు. ఆ రోజు రాత్రే విజయ దారుణంగా హత్య చేయబడుతుంది. భూమా .. వంట మనిషి రాణి ఇద్దరూ కనిపించకుండా పోతారు. జమీందారును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతణ్ణి జైలుకి తీసుకుని వెళతారు.
డెవిల్ (కల్యాణ్ రామ్) బ్రిటీష్ సీక్రెట్ ఏజెంటుగా పనిచేస్తూ ఉంటాడు. అతణ్ణి 'రాసపాడు' వెళ్లవలసిందిగా పై అధికారులు చెబుతారు. అక్కడ జరిగిన జమీందారు కూతురు మర్డర్ మిస్టరీని ఛేదించడానికి వచ్చినట్టుగా నటిస్తూ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న నేతాజీ సీక్రెట్ ఏజెంట్లను పట్టుకోమని చెబుతారు. ఇండియాలో నేతాజీ ఏ ప్రదేశంలో ల్యాండ్ అవుతున్నాడో తెలుసుకోమని ఆదేశిస్తారు. దాంతో డెవిల్ ఆ గ్రామానికి చేరుకుంటాడు .. అక్కడి ట్రావిలర్ బంగ్లాలో బస చేస్తాడు.
విజయను ఎవరు హత్య చేశారనే విషయాన్ని కనుక్కోవడానికి డెవిల్ రంగంలోకి దిగుతాడు. జమీందారు భార్య కామాక్షి (సీత)తోను .. ఆమె మేనకోడలు 'నైషధ' (సంయుక్త మీనన్) తో మాట్లాడతాడు. నైషధ 'లండన్'లో చదువుకుని వచ్చిందని తెలిసి ఆశ్చర్యపోతాడు. అలాగే పట్వారి .. ఆయన భార్య రోజీతో కూడా మాట్లాడతాడు. ఆ ప్రాంతానికి సంబంధించిన సమాచారాన్ని నేతాజీకి అందించేది నైషధ అనే అనుమానం డెవిల్ కి కలుగుతుంది. అలాగే విజయ మర్డర్ కేసు విషయంలో పట్వారిపై అతనికి అనుమానం బలపడుతుంది.
నేతాజీ నుంచి కోడ్ భాషలో వచ్చిన సమాచారాన్ని డీ కోడ్ చేసి, త్రివర్ణకు పంపుతూ ఉంటుంది నైషధ. ఈ విషయం డెవిల్ ద్వారా బ్రిటిష్ అధికారులకు తెలిసిపోతుంది. దాంతో నేతాజీ రాకకై సంబంధించిన సమాచారాన్ని త్రివర్ణ ... నైషధల నుంచి తీసుకోవాలి. ఆ తరువాత ఆ ఇద్దరినీ చంపేయాలని బ్రిటిష్ అధికారులు భావిస్తారు. ఆ బాధ్యతను కూడా డెవిల్ కే అప్పగిస్తారు. అప్పుడు డెవిల్ ఏం చేస్తాడు? దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? అనేదే కథ.
ఈ సినిమాకి కథ .. స్క్రీన్ ప్లే .. సంభాషణలను శ్రీకాంత్ విస్సా అందించాడు. కథ విషయానికి వస్తే చాలా క్లారిటీతో .. సామాన్య ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా నడుస్తుంది. ఫస్టాఫ్ లో అనేక సందేహాలు రేకెత్తిస్తూ .. సెకండాఫ్ లో మరింత సస్పెన్స్ లో పెట్టేస్తూ ఆయన ఈ కథను నడిపించాడు. సుభాష్ చంద్రబోస్ ను గురించిన ప్రస్తావనతో మొదలైన కథ .. గ్రామీణ నేపథ్యంలోని జమీందారు ఫ్యామిలీ ఎపిసోడ్ తో ఆసక్తిని పెంచుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది.
సెకండాఫ్ లో బ్రిటీష్ అధికారులను అయోమయంలో పడేసే సీన్ ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేశారు. ప్రీ క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ .. క్లైమాక్స్ లోని మరో ట్విస్ట్ ఆడియన్స్ గెస్ చేయని విధంగానే ఉంటాయి. అప్పటి వరకూ నడిచిన కథకు ఈ ట్విస్టులు మరింత బలంగా మారి, నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళతాయి. 'సముద్రానికి ఆనకట్ట వేయడం .. త్రివర్ణానికి అడ్డుకట్ట వేయడం అసాధ్యం' వంటి కొన్ని డైలాగులు ఆకట్టుకుంటాయి.
దర్శకుడి విషయానికి వస్తే .. ప్రతి సన్నివేశాన్ని చిత్రీకరించిన తీరు బాగుంది. ఎఫెక్ట్ కోసం కొన్ని దృశ్యాలను వర్షంలో చిత్రీకరించాడు. ఆ సన్నివేశాలకు అది అవసరం కూడా. ఇద్దరు బ్రిటిష్ అధికారులు .. కల్యాణ్ రామ్ .. సంయుక్త మీనన్ .. మాళవిక నాయర్ పాత్రల చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. రైటర్ - డైరెక్టర్ ఏదైతే కంటెంట్ అనుకున్నారో, ఆ కంటెంట్ ను పెర్ఫెక్ట్ గా తెరపైకి తీసుకుని వచ్చారు.
1945కి చెందిన కథ కనుక .. అందుకు తగిన కాస్ట్యూమ్స్ .. వస్తువులు .. వాహనాలు .. భవనాలు .. ఇంటీరియర్ డెకరేషన్స్ .. సామాజిక వాతావరణం ఇవన్నీ చూపించడంలో దర్శకుడు చాలా కసరత్తు చేశాడనే విషయం అర్థమవుతుంది. ఇదే సమయంలో మాస్ ఆడియన్స్ ఆశించే వినోదం పాళ్లు తగ్గాయేమోనని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే .. ఇది నేతాజీ నేపథ్యంలో .. ఆయన క్షేమాన్ని కోరే కొంతమంది అభిమానుల చుట్టూ సీరియస్ గా తిరిగే కథ ఇది. అందువలన హీరోకి .. హీరోయిన్ కి మధ్య లవ్ ట్రాక్ కూడా ఆశించినస్థాయిలో ఉండదు.
యాక్షన్ సీన్స్ హైలైట్ గా అనిపిస్తాయి. కానీ లవ్ కీ .. రొమాన్స్ కి ఏ మాత్రం చోటు దక్కలేదు. సత్య పాత్ర ద్వారా కామెడీని టచ్ చేయడానికి ట్రై చేశారుగానీ, అది కూడా అంతంత మాత్రమే. ప్రధానమైన కథాంశం ఏదైతే ఉంటుందో ... అది మాత్రం పెర్ఫెక్ట్ గా ఉంది. ఆర్టిస్టుల పరంగా చూసుకుంటే, డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను కల్యాణ్ రామ్ వన్ మెన్ ఆర్మీగా నడిపిస్తూ వెళ్లాడు. అజయ్ .. సీనియర్ హీరోయిన్ సీత పాత్రలు ఒకటి .. రెండు డైలాగ్స్ కి మాత్రమే పరిమితమవుతాయి.
హర్షవర్ధన్ బాణీలు ఫరవాలేదు. నేపథ్య సంగీతానికి ఎక్కువ మార్కులు ఇవ్వొచ్చు. తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ నీట్ గా అనిపిస్తుంది. నిదానంగా నడిచినప్పటికీ ఇంట్రెస్టింగ్ డ్రామా .. కంటెంట్ ఉన్న సినిమానే ఇది.
ప్లస్ పాయింట్స్: కథ .. కథనం .. నిర్మాణ విలువలు .. ఫైట్స్ .. 1945 నాటి నేపథ్యం .. లొకేషన్స్ .. కెమెరా పనితనం .. నేపథ్య సంగీతం.
మైనస్ పాయింట్స్: లవ్ .. రొమాన్స్ .. కామెడీకి చోటు లేకపోవడం. మాస్ ఆడియన్స్ ఆశించే వినోదానికి కథ కాస్త దూరంగా వెళ్లడం .. విషయం లేకపోవడం వలన కొన్ని పాత్రలు తేలిపోవడం.

Movie Name: Devil
Release Date: 2023-12-29
Cast: Nandamuri Kalyan Ram, Samyuktha Menon, Malavika Nair, Satya, Ajay, Sitha,Edward Sonnenblick,Mark Bennington
Director: Abhishek Nama
Producer: Abhishek Nama
Music: Harshavardhan Rameshwar
Banner: Abhishek Pictures
Review By: Peddinti
Devil Rating: 3.00 out of 5
Trailer