'భోళాశంకర్' మూవీ రివ్యూ
- 'భోళా శంకర్'గా వచ్చిన చిరంజీవి
- ఆయన స్టైల్ .. యాక్షన్ ప్రత్యేకమైన ఆకర్షణ
- పాటలు .. డాన్సులు .. ఫైట్స్ హైలైట్
- పేలని కామెడీ .. సాగదీసిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్
- కంటెంట్ విషయంలో మెగాస్టార్ స్థాయికి తగినట్టుగా కనిపించని కసరత్తు
చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందిన 'భోళాశంకర్' ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా, గతంలో తమిళంలో వచ్చిన 'వేదాళం' సినిమాకి రీమేక్. యాక్షన్ తో పాటు ఎమోషన్ తో కూడిన ఈ సినిమాకి, మాస్ ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకోగలిగిందనేది ఇప్పుడు చూద్దాం.
ఈ కథ కోల్ కతాలో మొదలవుతుంది .. ఆ నేపథ్యంలోనే నడుస్తుంది. కోల్ కతాలో ఆడపిల్లల కిడ్నాప్ లు పెరిగిపోతాయి. పేరెంట్స్ వెంట ఉన్నప్పటికీ ఒక ముఠా చాలా తెలివిగా అమ్మాయిలను కిడ్నాప్ చేస్తూ ఉంటుంది. కిడ్నాప్ చేయబడిన అమ్మాయిలను ఇతర దేశాలకు అమ్మేస్తూ ఉంటారు. అలెక్స్ .. ఛార్లెస్ .. ఛోటు అనే ముగ్గురు అన్నదమ్ములు ఈ రాకెట్ వెనకున్న సూత్రధారులు. కోల్ కతాలో ఉన్న తమ అనుచరుల ద్వారా వాళ్లు ఈ పనులను కొనసాగిస్తూ ఉంటారు. దాంతో కోల్ కతాలో ఒక ఆందోళనకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది.
అలాంటి పరిస్థితుల్లో భోళాశంకర్ (చిరంజీవి) తన చెల్లెలు మహాలక్ష్మి (కీర్తి సురేశ్) తో కలిసి, కోల్ కతాలో అడుగుపెడతాడు. తెలిసిన వారి ద్వారా అక్కడ క్యాబ్ డ్రైవర్ గా పని సంపాదించుకుంటాడు. అలాగే ఒక మంచి కాలేజ్ లో చెల్లెలిని చేర్పిస్తాడు. అక్కడే లాయర్ 'లాస్య' (తమన్నా)తో భోళాకి పరిచయమవుతుంది. అనుకోకుండా ఆమె బ్రదర్ శేఖర్ ( సుశాంత్) భోళా చెల్లెలిపై మనసు పారేసుకుంటాడు. అతనితో ఆమె పెళ్లి జరిపించడానికి భోళా ఒప్పుకుంటాడు.
ఈ నేపథ్యంలోనే కోల్ కతా పోలీస్ డిపార్టుమెంటు ఆటో డ్రైవర్లతో .. క్యాబ్ డ్రైవర్లతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆడపిల్లల కిడ్నాప్ వెనకున్న కొంతమంది ఫొటోలను వారికి అందజేస్తుంది. వాళ్లలో ఎవరు కనిపించినా తమకి కాల్ చేయమని ఎలర్ట్ చేస్తారు. ఓ ఆపరేషన్ కోసం తన బృందంతో కలిసి కోల్ కతాకు వచ్చిన 'ఛోటు'ను భోళా గుర్తుపడతాడు. తానే స్వయంగా అతణ్ణి చంపేస్తాడు. తన తమ్ముడిని గురించి పోలీసులకు సమాచారాన్ని అందించింది 'భోళా' అనే విషయం 'అలెక్స్' .. ' ఛార్లెస్' లకు తెలుస్తుంది.
దాంతో 'భోళా' అంతు చూడాలనే కసితో ఛార్లెస్ కోల్ కతాకు వస్తాడు. తన తమ్ముడితో పాటు అతని గ్యాంగ్ ను భోళా మట్టుబెట్టిన తీరును పరిశీలిస్తాడు. తమ పట్ల పగతో ... ప్రతీకారంతో .. కసితోనే భోళా అంత క్రూరంగా అంతం చేశాడని గ్రహిస్తాడు. భోళాను చంపేయడం కోసం తన టీమ్ తో కలిసి రంగంలోకి దిగుతాడు. ఆ తరువాత ఏం జరుగుతుంది? అలెక్స్ బ్రదర్స్ పట్ల భోళా అంత కసిగా ఉండటానికి కారణం ఏమిటి? అతని గతం ఎలాంటిది? అనే ప్రశ్నలకు సమాధానంగా మిగతా కథ నడుస్తుంది.
చాలా గ్యాప్ తరువాత మెహర్ రమేశ్ తెరకెక్కించిన సినిమా ఇది. రీమేక్ అయినప్పటికీ కొన్ని మార్పులు చేశాననీ .. మెగాస్టార్ మార్క్ ను చూపించానని మెహర్ రమేశ్ చెబుతూ వచ్చిన సినిమా ఇది. 'భోళా శంకర్' టైటిల్ తోనే అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. చిరంజీవి మాస్ యాక్షన్ స్టిల్స్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. అంత హుషారుతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు, ఈ సినిమాలో స్టైల్ .. డాన్సులు .. ఫైట్లు పరంగా మెగాస్టార్ మార్కు కనిపిస్తుందిగానీ, అందుకు తగిన సన్నివేశాలను మెహర్ డిజైన్ చేసుకోలేకపోయాడనిపిస్తుంది.
టైటిల్స్ తో పాటే విలన్ ఎంట్రీ ఇప్పించిన దర్శకుడు .. చాలా ఫ్రెష్ లుక్ తో హీరో ఇంట్రడక్షన్ ఇప్పించాడు. ఫస్టాఫ్ లో యాక్షన్ కీ .. కామెడీకి మాత్రమే ప్రాధాన్యత్యనిచ్చాడు. వెన్నెల కిశోర్ ద్వారా చిరంజీవి వైపు నుంచి .. హైపర్ ఆది ద్వారా తమన్నా వైపు నుంచి కామెడీని పిండటానికి ప్రయత్నించారు గానీ వర్కౌట్ కాలేదు. ముఖ్యంగా వెన్నెల కిశోర్ పోషించిన 'వంశీ' పాత్రను అతని భార్య ప్రేమతో టార్చర్ పెట్టే కామెడీ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ఇక ఎక్స్ ప్రెషన్ లేకుండా ఆది చెప్పే డైలాగ్స్ కూడా పెద్దగా పేలవు.
కథ అటు తిరిగి .. ఇటు తిరిగి మొత్తానికి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తోనే ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. దాంతో సహజంగానే ఆ తరువాత ఏమౌతుందా అని ఆడియన్స్ ఆసక్తితో వెయిట్ చేస్తారు. అందుకు తగినట్టుగానే భోళా ఫ్లాష్ బ్యాక్ తో సెకండాఫ్ మొదలవుతుంది. ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించిన పాయింట్ కొత్తది కాకపోయినా, కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. కానీ ఆ ట్రాకును మెహర్ రమేశ్ అలా సాగదీస్తూనే వెళుతూ విసిగించాడు. మురళీ శర్మ .. తులసి .. శ్రీముఖి కాంబినేషన్ లోని ఈ సీన్స్ పస లేనివిగా అనిపిస్తాయి.
మెగాస్టార్ తో తమన్నా రొమాన్స్ ను డిజైన్ చేయలేకపోయారు. ఆ లోటును యాంకర్ శ్రీముఖి - యాంకర్ రష్మీ ద్వారా కొంతవరకూ భర్తీ చేయడానికి ప్రయత్నించడం మెహర్ చేసిన మరో పొరపాటు. ఇక చిరంజీవితో పవన్ ను ఇమిటేట్ చేయించడం .. 'ఖుషీ' సినిమాలోని పవన్ - భూమిక సీన్ ను చిరంజీవి - శ్రీముఖిపై చిత్రీకరించడం వంటి విన్యాసాలు కూడా చేశాడు. ఇలా ఎక్కడికక్కడ మెహర్ హడావిడి పడిపోవడం కనిపిస్తూనే ఉంటుంది.
ఫ్లాష్ బ్యాక్ లో చిరంజీవి ఎంట్రీ సీన్ .. అలాగే క్లైమాక్స్ లో భాగంగా 'మహాలక్ష్మి' ని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళుతూ ఉంటే, ఆ కారును హీరో ఫాలో కావడం వంటి సీన్స్ ను చిత్రీకరించిన తీరు బాగుంది. చిరంజీవి ఎనర్జీకి .. ఆయన యాక్టింగ్ కి వంక బెట్టవలసిన అవసరం లేదు. కాకపోతే ఆయనకి తగిన కంటెంట్ ను పెర్ఫెక్ట్ గా రెడీ చేయలేదని అనిపిస్తుంది. కీర్తి సురేశ్ నటన ఓకే .. తమన్నా మాత్రం కాస్త ఒళ్లు తగ్గిస్తే బాగుండునని అనిపిస్తుంది. మిగతా వాళ్లంతా ఎవరి పాత్ర పరిధిలో వాళ్లు చేశారు.
మహతి స్వర సాగర్ స్వరపరిచిన బాణీలు బాగున్నాయి. బాణీల పరంగా వాళ్ల ఫాదర్ ను గుర్తుచేశాడు. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దగ్గరికి వచ్చేసరికి, సన్నివేశానికి మించిన హోరు వినిపిస్తుంది. ఫొటోగ్రఫీ బాగుంది .. జిల్లెలే .. జామ్ జామ్ .. మిల్కీ బ్యూటీ వంటి సాంగ్స్ ను .. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటుంది. ఈ మూడు పాటల కొరియోగ్రఫీ పరంగా శేఖర్ మాస్టర్ కి ఎక్కువ మార్కులు ఇవ్వొచ్చు.
రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ మెగాస్టార్ స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. ఎడిటింగ్ విషయానికొస్తే, చిరంజీవిని తమన్నా బృందం బెదిరించడం .. వెన్నెల కిశోర్ పబ్ సీన్ .. మురళీ శర్మ ఇంటి పత్రాలకు సంబంధించిన సీన్స్ విషయంలో కత్తెరకి మరి కొంత పని చెప్పవలసింది. డైలాగ్స్ విషయానికొస్తే .. " మనం వెతకడం మొదలుపెట్టాం .. వాడు ఆల్రెడీ వేటాడటం మొదలుపెట్టాడు" అంటూ చిరంజీవి పాత్రను ఉద్దేశించి చెప్పే డైలాగ్ హైలైట్.
ప్లస్ పాయింట్స్: నిర్మాణ విలువలు .. చిరంజీవి స్టైల్ .. యాక్టింగ్ .. పాటలు .. ఫొటోగ్రఫీ .. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్.
మైనస్ పాయింట్స్: ఆకట్టుకోని కామెడీ .. సెకండాఫ్ లో మురళీశర్మ ఇంటి నేపథ్యంలోని ట్రాక్ ను సాగదీయడం .. లూజ్ సీన్స్ ను వదిలేయడం.
* ఒక్క మాటలో చెప్పాలంటే అన్నివైపుల నుంచి మెగాస్టార్ కి కావలసినంత కంటెంట్ ను అందించలేకపోయిన సినిమా ఇది.

Movie Name: Bhola Shankar
Release Date: 2023-08-11
Cast: Chiranjeevi, Tamannaah Bhatia, Keerthy Suresh,Tarun Arora, Vennela Kishore,Murali Sharma, Sreemukhi
Director: Mehar Ramesh
Producer: Ramabrahmam Sunkar
Music: Mahathi Swara Sagar
Banner: AK Enetartainmets
Review By: Peddinti
Bhola Shankar Rating: 2.75 out of 5
Trailer