విక్కీ కౌశల్ ప్రధానమైన పాత్రను పోషించిన 'ఛావా' సినిమా, ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన థియేటర్లకు వచ్చింది. 130 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, 800 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 11వ తేదీన హిందీలోనే స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ రోజున తెలుగులోను అందుబాటులోకి వచ్చింది. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను పలకరించింది.
కథ: ఛత్రపతి శివాజీ మరణం తరువాత ఆయన తనయుడు శంభాజీ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. మారాఠాలంతా ఆయన కనుసైగలలో పనిచేయడం మొదలుపెడతారు. ఛత్రపతి మరణించిన తరువాత దక్కను ప్రాంతమంతా తేలికగా తన వశమవుతుందని భావించిన ఔరంగజేబు ఆలోచనలో పడతాడు. శంభాజీని ఎలా దొంగదెబ్బతీయాలా ఆమె విషయంపై అదేపనిగా ఆలోచన చేస్తూ ఉంటాడు.
ఇక శంభాజీ కోటలోను ఆయనకి తెలియకుండా వారసత్వ నిప్పు రగులుకుంటూ ఉంటుంది. శంభాజీని సింహాసనం నుంచి దింపడానికీ, అవసరమైతే ఆయన ప్రాణాలు తీయడానికి కొన్ని స్వార్థ శక్తులు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. తాము అనుకున్నది సాధించడం కోసం శత్రువులతో సైతం చేతులు కలపడానికి ఆ స్వార్థ శక్తులు మంతనాలు కొనసాగిస్తూ ఉంటాయి. తన వెనుక జరుగుతున్న ఈ కుట్రలను గురించి శంభాజీకి తెలుస్తుంది.
మరాఠా వీరులందరినీ శంభాజీ ఏకం చేస్తాడు. శివాజీ మహారాజ్ ఆశయాలను వారికి గుర్తుచేస్తాడు. ఔరంగజేబు సైనిక బలగాలను ఎదుర్కోవడానికి తగిన ప్రణాళిక రచన చేస్తాడు. అయితే ఈ విషయాన్ని కొంతమంది నమ్మక ద్రోహులు ఔరంగజేబుకు చేరవేస్తారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? శంభాజీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు? అనేది మిగతా కథ.
విశ్లేషణ: శివాజీ మహారాజ్ తనయుడైన శంభాజీ కథ ఇది. మొగల్ రాజుల కుట్రలు .. దాడులను ఎదుర్కుంటూ ఆయన ఎలా ముందుకు సాగాడు అనేదే ఈ కథలోని ప్రధానమైన అంశం. అడుగడుగునా ఆయన శౌర్య పరాక్రమాలను ఆవిష్కరిస్తూనే ఈ సినిమా ముందుకు వెళుతుంది. ఆయన దేశభక్తి .. త్యాగనిరతికి అద్దం పట్టే ఆసక్తికరమైన ఘట్టాల చుట్టూనే ఈ కథ తిరుగుతూ ఉంటుంది.
16వ శతాబ్దంలో జరిగిన సంఘటన ఇది. ఆ కాలం నాటి సామాజిక వాతావరణం .. సెట్స్ .. కాస్ట్యూమ్స్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణ అనే చెప్పాలి. ముఖ్యంగా లైటింగ్ .. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయని చెప్పక తప్పదు. శంభాజీ ఇంట్రడక్షన్ .. మొగల్ సైన్యం ఆయనను చుట్టుముట్టిన సన్నివేశం .. ఆయనను బంధించే సన్నివేశం హైలైట్స్ లో కనిపిస్తాయి.
పనితీరు: దర్శకుడు తయారు చేసుకున్న కంటెంట్ పెర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. ఒక వైపున శంభాజీ .. మరో వైపున ఔరంగజేబు పాత్రలతో పాటు, మధ్యలో 'అక్బర్ పాత్రను కూడా టచ్ చేశాడు. అయితే ఆ పాత్రను లైట్ తీసుకోవడమే కాస్త అంతృప్తిని కలిగిస్తుంది. శంభాజీగా వికీ కౌశల్ .. ఆయన భార్య పాత్రలో రష్మిక .. ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా నటన .. ప్రధానమైన ఆకర్షణగా చెప్పుకోవచ్చు.
సౌరభ్ గోస్వామి ఫొటోగ్రఫీ .. ఏఆర్ రెహ్మాన్ నేపథ్య సంగీతం .. మన్సిఫ్ ప్రధాన్ ఎడిటింగ్ కథకి బలమైన సపోర్టుగా నిలిచాయి. సంభాషణలు అనువాదంలో కంటే కూడా మూలలో బాగా పేలాయి. 'రాజకీయాలలో ఎదగాలనుకునేవారు కుటుంబ సభ్యులను అస్సలు నమ్మకూడదు' .. 'నేను మాత్రమే కాదు .. మా సైనికుడు వచ్చినా ఇలాగే ఉంటుంది' అంటూ శంభాజీ చెప్పే డైలాగ్ .. 'నమ్మకంతో చేసే యుద్ధం కూడా ఉత్సవమే' అనే సంభాషణలు పట్టుకుంటాయి.
ముగింపు: శంభాజీ జీవితచరిత్ర .. మొగల్ రాజులతో యుద్ధాలు .. రాజకీయ పరమైన ఎత్తుగడలు .. ఆ కాలంనాటి పరిస్థితులను అందంగా ఆవిష్కరించిన సినిమా ఇది. దేశభక్తితో కూడిన ఎమోషన్స్ ను కనెక్ట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.
'ఛావా' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
| Reviews

tt27922706 Review
- ఫిబ్రవరిలో థియేటర్లకు వచ్చిన 'ఛావా'
- 800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన సినిమా
- నిన్నటి నుంచి మొదలైన స్ట్రీమింగ్
- ఆకట్టుకునే యాక్షన్ .. ఎమోషన్
- హైలైట్ గా అనిపించే సెట్స్ .. కాస్ట్యూమ్స్ .. ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్
Movie Name: tt27922706
Release Date: 2025-04-12
Cast: Vicky kaushal, Rashmika, Akshaye Khann, Divya Dutta, Neil Bhoopalam
Director: laxman Utekar
Music: AR Rehman
Banner: Maddock Films
Review By: Peddinti
tt27922706 Rating: 3.25 out of 5
Trailer