రొమాంటిక్ కామెడీ కంటెంట్ యూత్ కి బాగా పడుతుంది. కాకపోతే ఆ జోనర్లో పడాల్సిన అంశాలు పడాలి అంతే. అలా ఈ జోనర్లో రూపొందిన సినిమానే '14 డేస్ .. గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో'. అంకిత్ కొయ్య - శ్రియా కొంతం ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ ఏడాది మార్చి 7వ తేదీన థియేటర్లకు వచ్చింది. శ్రీహర్ష మన్నే దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 4వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ: హర్ష (అంకిత్) ఒక యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తూ ఉంటాడు. సినిమా దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలనేది అతని ఆశయం. ఒక డేటింగ్ యాప్ ద్వారా అతనికి 'అహానా' (శ్రియా కొంతం)తో పరిచయం ఏర్పడుతుంది .. అది కాస్తా ప్రేమగా మారుతుంది. ఒక రోజున ఒక పెళ్లికి తన పేరెంట్స్ వెళ్లడంతో, హర్షను 'అహానా' తన ఇంటికి పిలుస్తుంది. ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తారు. అయితే ఊహించని విధంగా ఆమె పేరెంట్స్ వెంటనే తిరిగొస్తారు. పెళ్లి కొడుక్కి 'కరోనా' రావడం వలన పెళ్లి ఆగిపోయిందని చెబుతారు.
'అహానా' బెడ్ రూమ్ లోనే 'హర్ష' ఉండిపోతాడు. అతనిని ఎలా బయటికి పంపించాలా అని ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఈ ఫ్యామిలీ .. కరోనా సోకినా వ్యక్తి ఫంక్షన్ నుంచి రావడం వలన, అపార్టుమెంటువారు బయట నుంచి వీరి డోర్ లాక్ చేస్తారు. దాంతో హర్ష బయటికి వెళ్లలేని పరిస్థితి. ఈ లోగా హాస్పిటల్ సిబ్బంది వచ్చి, 'ఐసోలేషన్' పేరుతో 'అహానా'తో పాటు ఆమె పేరెంట్స్ ను 'ఐసోలేషన్' వార్డుకు తీసుకుని వెళతారు.
హాస్పిటల్ కి వెళ్లే ముందు బయట డోర్ కి అహానా తల్లి మరో తాళం వేస్తుంది. దాంతో హర్ష ఆ ఇంట్లోనే చిక్కుబడిపోతాడు. హాస్పిటల్ నుంచి హర్షకి రహస్యంగా అహానా కాల్ చేస్తుంది. 14 రోజుల పాటు తాము హాస్పిటల్లోనే ఉండిపోతున్నట్టు చెబుతుంది. అప్పుడు హర్ష ఏం చేస్తాడు? ఆ ఇంటి నుంచి ఎలా బయటపడతాడు? హాస్పిటల్లో ఉన్న అహానాకి ఎదురయ్యే అనూహ్యమైన పరిస్థితి ఏమిటి? అనేది మిగతా కథ.
విశ్లేషణ: ''ఇప్పుడు కాలం మారిపోయింది. వయసుకొచ్చిన పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వాలి .. లేదంటే మనలను పాతకాలం మనుషులు అనుకుంటారు ..' అని భావించే పేరెంట్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. 'ఇంకా పాతకాలం వాళ్లకు మాదిరిగా పిల్లలకి హద్దులు గీయకండి .. మంచేదో .. చెడేదో ఆ మాత్రం వాళ్లకి తెలియదా' అని తమని తాము ఆధునీకతకు ప్రతినిధులుగా భావించుకుంటూ, పద్ధతి గల పేరెంట్స్ కి క్లాసులు పీకే వారు ఇంకొందరు. అలా వయసులోని పిల్లలకు స్వేచ్ఛను ఇస్తే ఏమౌతుంది? అనే అంశం చుట్టూ తిరిగే కథనే ఇది.
కేవలం 6 ప్రధానమైన పాత్రల చుట్టూ అల్లుకున్న కథ ఇది. కరోనా సమయంలో .. ఒక ఫ్లాట్ లో నాలుగు గోడల మధ్య జరిగే కథ ఇది. ఒక చిన్న బడ్జెట్ లో .. ఆసక్తికరమైన కంటెంట్ ను దర్శకుడు డిజైన్ చేసుకున్న తీరు బాగుంది. ఆ కాస్త కథలోనే లవ్ .. కామెడీ .. ఎమోషన్స్ ను మిక్స్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. అలాగే ఇంద్రజ పాత్రవైపు నుంచి .. హీరోయిన్ పాత్రవైపు నుంచి ఉన్న ట్విస్టులు కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి.
పనితీరు: చిన్న కథ .. చింతలేని కథ అన్నట్టుగా ఉన్నంతలోనే దర్శకుడు ఈ కథను నడిపించిన విధానం మెప్పిస్తుంది. వెన్నెల కిశోర్ పాత్ర వైపు నుంచి కామెడీ మంచి హెల్ప్ అయింది. అంకిత్ పాత్ర పరిధిలో చేశాడు. అయితే ప్రత్యేకమైన ఆకర్షణ శ్రియానే. క్యూట్ గా కనిపిస్తూ .. నటనతోను మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఇంద్రజ వలన ఒక నిండుదనం వచ్చింది. యూత్ కి సందేశం ఇచ్చే ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.
సోమశేఖర్ ఫొటోగ్రఫీ బాగుంది .. కథ నాలుగు గోడల మధ్యనే తిరుగుతున్నా, బోర్ కొట్టని షాట్స్ ను డిజైన్ చేసుకున్నాడు. మార్క్ కె రాబిన్ నేపథ్య సంగీతంతో పాటు బాణీలు కూడా బాగానే ఉన్నాయి. ప్రదీప్ ఎడిటింగ్ కి కూడా వంకబెట్టవలసిన పనిలేదు.
ముగింపు: పెద్దల నమ్మకాలు .. పిల్లల తొందరపాటుకి మధ్య జరిగే సంఘర్షణను, వినోదాన్ని జోడిస్తూ ఇచ్చిన సందేశం ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. సింపుల్ కంటెంట్ ద్వారా ఒక బలమైన పాయింట్ ను చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. యూత్ ని ఆలోచింపజేసే సినిమా ఇది.
'14 డేస్ .. గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
| Reviews

14 Days Girl Friend Intlo Review
- క్రితం నెలలో థియేటర్లకు వచ్చిన సినిమా
- ఈ నెల 4వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్
- యూత్ ను దృష్టిలో పెట్టుకుని అల్లిన కథ
- ఆసక్తికరంగా సాగిపోయే కథనం
- ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్
Movie Name: 14 Days Girl Friend Intlo
Release Date: 2025-04-04
Cast: Ankith Koyya, Shriya Kontham, Vennela Kishore, Indraja
Director: Sriharsha Manne
Music: Mark K Robin
Banner: Sathya Arts
Review By: Peddinti
14 Days Girl Friend Intlo Rating: 2.75 out of 5
Trailer