కథలో కొత్తదనం ఉంటే చిన్న సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ నమ్మకంతోనే కొంత మంది దర్శక, నిర్మాతలు కంటెంట్‌లో నవ్యతతో కొత్తవాళ్లతో సినిమాలు తీస్తున్నారు. ఈ కోవలోనే రూపొందిన చిత్రం 'టుక్ టుక్'. ఫాంటసీ మ్యాజికల్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ చిత్ర కథాంశం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందనేది చూద్దాం.
కథ: ఓ గ్రామంలో నివసించే ముగ్గురు కుర్రాళ్లు.(హర్ష రోషన్, కార్తీక్ దేవ్, స్టీవెన్ మధు)లు ఎటువంటి లక్ష్యం లేకుండా ఆవారాగా తిరుగుతుంటారు. వాళ్లు చేసే ఓ చెడ్డపనికి కెమెరా కొనాలనుకుంటారు. ఇందుకోసం ఊర్లో వినాయక చవితి పేరిట డబ్బులు వసూలు చేసి దానితో కెమెరా కొనాలని నిర్ణయించుకుంటారు. అయితే వినాయకుని నిమజ్జనం, ఊరేగింపు కోసం తాము తయారుచేసిన ఆటో కమ్ స్కూటర్‌లో కొన్ని అద్భుత శక్తులు వస్తాయి. ఈ క్రమంలో గ్రామంలో కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి.
అయితే అసలు ఆ వెహికల్‌లో ఆ శక్తులు ఎలా వచ్చాయి? ఆ బండి ఎందుకు కదులుతుంది? దీని వల్ల ఆ కుర్రాళ్ల జీవితంలో చోటు చేసుకున్న మార్పులు ఏమిటి? ఈ చిత్రంలో మేఘ శాన్వీ పాత్రకు ఈ కుర్రాళ్ల లైఫ్‌కు ఉన్న సంబంధమేమిటి? నిహాల్, మేఘ శాన్వీల రిలేషన్ ఏమిటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: ఓ సింపుల్ స్టోరీకి ఫాంటసీ, థ్రిల్లర్, హారర్ అంశాలను జోడించి దర్శకుడు ఈ కథను తయారుచేసుకున్నాడు. ఒక వెహికల్ ఫాంటసీ అంశాలతో కూడిన కథతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. 'బామ్మమాట బంగారు బాట, 'కారుదిద్దిన కాపురం' ఇలాంటి కథలతో వచ్చినవే. ఈ చిత్రంలో లవ్ ఎలిమెంట్స్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషనల్ పార్ట్‌ను జతచేశాడు దర్శకుడు. 'టుక్ టుక్' అనే వెహికల్ చుట్టు కథను అల్లుకున్నాడు.
అయితే కథలో మెయిన్ స్ట్రాంగ్ పాయింట్ లేకపోవడంతో స్క్రీన్‌ప్లేను కూడా అంత బలంగా అనిపించలేదు. కొన్ని లవ్ సీన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఫస్ట్‌హాఫ్ అంతా అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాళ్లు .. వాళ్ల పనులతో కొనసాగితే, వెహికల్ వెనుక ఉన్న కథలో భాగంగా వచ్చే ప్రేమకథతో సెకండాఫ్ ఉంటుంది. అయితే తొలిభాగం కాస్త హుషారుగా కొనసాగినా, సెకండ్‌హాఫ్ స్లోగా అనిపిస్తుంది.
టీనేజ్ కుర్రాళ్లు ఊర్లో అమ్మాయిలు, ఆంటీలు స్నానాలు చేస్తుంటే బాత్రూమ్‌లో తొంగి చూసే సన్నివేశాలు కాస్త అభ్యంతరకరంగా అనిపిస్తాయి. కుర్రాళ్ల పాత్రలు కూడా ఓవర్‌ది బార్డర్‌లా బిహేవ్ చేస్తుంటాయి. వీటి విషయంలో దర్శకుడు జాగ్రత్త తీసుకుని సినిమాలో మరింత రక్తికట్టించే అంశాలు, ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్‌ను బలంగా రాసుకుని ఉంటే సినిమా మరింత అలరించేంది.
ఓ వెహికల్‌కు లైఫ్ వస్తే ఎలా ఉంటుంది అనే అంశం చుట్టు మరింత బలమైన ఎమోషనల్ సన్నివేశాలు, ఆడియన్స్‌ను కడుపుబ్బ నవ్వించే ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడమే ఈ సినిమాకు మైనస్‌గా అనిపిస్తుంది. మొత్తంగా వెహికల్ చుట్టు అల్లు కున్న అంశాలు, వెహికల్ మ్యాజిక్ పిల్లలను, ఫ్యామిలీస్‌ను ఆకట్టుకునే అవకాశం ఉంది. సినిమాపై ఎటువంటి అంచనాలు లేకుండా వెళితే.. జస్ట్ టైమ్‌పాస్ వాచ్‌లా 'టుక్ టుక్' ఉంటుంది.
నటీనటుల పనితీరు: హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు,సాన్వీ మేఘన, నిహాల్ తమ పాత్రల్లో పూర్తి ఎనర్జీతో కనిపించారు. ఇటీవల 'కుడుంబస్తాన్' చిత్రంతో ఆకట్టుకున్న తెలుగమ్మాయి సాన్వీ మేఘన ఈ చిత్రంలో కూడా క్యూట్‌గా ఉంది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌లో నవ్యత ఉన్నా, ఆ అంశం చుట్టూ అల్లుకున్న స్రీన్‌ప్లే విషయంలో కాస్త తడబడ్డాడు. మేకింగ్ విషయంలో ఫర్వాలేదనిపించుకున్నాడు. సంగీతం, ఫోటోగ్రఫీకి మంచి మార్కులు పడతాయి.
స్క్రీన్‌ప్లేతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలో మరింత శ్రద్దపెడితే ఈ 'టుక్ టుక్' అందరిని అలరించేంది. ఫైనల్‌గా ఇది ఓ మోస్తరు ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించిన సగటు చిత్రంగా నిలిచింది.
'టుక్ టుక్' - మూవీ రివ్యూ!
| Reviews

Tuk Tuk Review
'టుక్ టుక్'అనే వెహికల్ చుట్టు అల్లుకున్న కథ
స్లోగా సాగిన కథ, కథనాలు
మోస్తరు ఆకట్టుకున్న వినోదం
స్లోగా సాగిన కథ, కథనాలు
మోస్తరు ఆకట్టుకున్న వినోదం
Movie Name: Tuk Tuk
Release Date: 2025-03-21
Cast: Karthikeya Dev, Steven Madhu, Sanvi Meghana, Nihal Kodati
Director: Supreeth Krishna
Music: Santhu Omkar
Banner: Chitravahini Entertainments
Review By: Madhu
Tuk Tuk Rating: 2.25 out of 5
Trailer