'మార్షల్' మూవీ రివ్యూ

14-09-2019 Sat 18:32
Movie Name: Marshal
Release Date: 2019-09-13
Cast: Abhay, Megha, Srikanth, Pelli Pruthvi, Pragathi, Sharanya Pradeep
Director: Jai Raja Singh
Producer: Abhay Adaka
Music: Varikuppala Yadagiri
Banner: A.V.L.Productions

ఒక వైపున తను పిచ్చిగా అభిమానించే హీరో, మరో వైపున తను ప్రాణంగా ప్రేమించే అక్క. ఆ హీరో కారణంగా తన అక్కయ్య ప్రాణాలకి ముప్పు ఏర్పడినప్పుడు ఆ యువకుడు ఏం చేశాడనేదే కథ. సినిమా మొదలైన దగ్గర నుంచి అంబులెన్సుల సైరన్లతో .. స్ట్రెచర్ల పరుగులతో .. హాస్పిటల్స్ వాతావరణంలో సాగుతుంది. ఈ తరహా సన్నివేశాలను చూడటానికి చాలామంది ఇష్టపడరు. ప్రధాన పాత్రను తీర్చిదిద్దే విషయంలో ప్రేక్షకులకు ఏర్పడిన గందరగోళం చివరి వరకూ అలాగే ఉంటుంది. సందేశం ఉన్నప్పటికీ సహనానికి పరీక్ష పెడుతుంది.

మెడికల్ మాఫియాకి సంబంధించిన కథలు గతంలో చాలానే వచ్చాయి. అయితే ఈ సారి ఒక కొత్త అంశాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించడానికి దర్శకుడు జై రాజసింగ్ ప్రయత్నించాడు. శ్రీకాంత్ ను ప్రధాన పాత్రధారిగా చేసుకుని ఆయన రూపొందించిన 'మార్షల్' ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందో చూద్దాం.

కథగా చూస్తే .. అభి (అభయ్) ఓ మధ్యతరగతి యువకుడు. ఓ ప్రైవేట్ సంస్థలో ఏరియా మేనేజర్ గా పనిచేస్తుంటాడు. నారాయణ (ప్రియదర్శిని రామ్) దంపతులు ఆయన తల్లిదండ్రులు. సుమ (శరణ్య ప్రదీప్) ఆయన అక్కయ్య. సుమ అంటే అభికి ప్రాణం. అలాగే హీరో శివాజీ (శ్రీకాంత్) అంటే అభికి విపరీతమైన అభిమానం. శివాజీ సినిమా విడుదల తొలి రోజు .. తొలి ఆటను ఆయన చూసి తీరవలసిందే. అలాంటి పరిస్థితుల్లోనే అభి అక్క సుమకి సంతానం కలిగే విషయంలో ఆలస్యమవుతుండటంతో ఒక హాస్పిటల్ కి తీసుకెళతారు. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వలన సుమ కోమాలోకి వెళుతుంది. అందుకు గల కారణాలను తెలుసుకోవడానికి అభి రంగంలోకి దిగుతాడు. తన అక్క కోమాలోకి వెళ్లడానికి హీరో శివాజీ కారణమనే విషయం అభికి అర్థమవుతుంది. శివాజీ నేపథ్యం ఎలాంటిది? ఆయనపై కోపంతో అభి ఏం చేస్తాడు? ఫలితంగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనే మలుపులతో కథ ముందుకు వెళుతుంది.

దర్శకుడు జై రాజసింగ్ మెడికల్ మాఫియా అంశాన్ని తీసుకుని, దానిని కొత్త కోణంలో ఆవిష్కరించడానికి ప్రయత్నించాడు. అభయ్ అనే హీరో కొత్త .. అభయ్ జోడీ కట్టిన శరణ్య ప్రదీప్ కూడా ఇక్కడివారికి పెద్దగా తెలియదు. అందువలన ఇది శ్రీకాంత్ సినిమా అనిపించేలానే ఆయన పాత్రకి ప్రాధాన్యతను ఇచ్చాడు. అయితే కథలో క్లారీటి లేకపోవడం .. కథనంలోని అయోమయం ప్రేక్షకులను తికమకపెడతాయి.

సాధారణంగా అంబులెన్స్ సైరన్ .. హాస్పిటల్ తాలూకు వాతావరణం .. చాలామందికి ఒక విధమైన ఆందోళన కలిగిస్తుంది. అందువలన హాస్పిటల్ నేపథ్యంలోని సీన్స్ చూడటానికి ఇష్టపడరు. అలాంటిది సినిమా మొత్తం అదే వాతావరణంలో సాగేలా చూడటమే దర్శకుడి వైపు నుంచి ప్రధానమైన లోపంగా కనిపిస్తుంది. వైద్య వ్యవస్థలోని చీకటి కోణాలను కొంతవరకూ టచ్ చేశాడు కాకపోతే ప్రధాన పాత్రధారి అయిన శ్రీకాంత్ పాత్ర అసలు ఏ కార్యాన్ని తలపెట్టింది? ఆయన ఉద్దేశం ఏమిటి? ఆ ప్రాజెక్టు ద్వారా ఆయన ఏం ఆశించాడు? అనే విషయాలను సాధారణ ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడంలో దర్శకుడు విఫలమయ్యాడు.

ఈ సినిమాతో హీరోగా అభయ్ పరిచయమయ్యాడు. ఈ సినిమాకి నిర్మాత కూడా ఆయనే. తన పాత్రకు న్యాయం చేయడానికి ఆయన తనవంతు కష్టపడ్డాడు. అయితే సినిమా మొదటి నుంచి చివరివరకూ ఎక్కడా కూడా ఆయన హీరోగా అనిపించడు. ఇక హీరోయిన్ గా గ్లామర్ పరంగా మేఘా చౌదరి ఆకట్టుకుంటుంది. ఆమె పాత్ర నటనకి పెద్దగా అవకాశం వున్నదేం కాదు. నెగెటివ్ షేడ్స్ తో కూడిన శివాజీ పాత్రలో శ్రీకాంత్ చాలా బాగా చేశాడు. తన పాత్రలోని వేరియేషన్స్ ను చూపించడంలో మెప్పించాడు. నారాయణ పాత్రలో ప్రియదర్శిని రామ్ .. హాస్పిటల్ ఎండీ రవీంద్ర రెడ్డి పాత్రలో 'పెళ్లి' పృథ్వీ తమ పరుథుల్లో నటించారు. ఇక సుమన్ .. ప్రగతి .. సుదర్శన్ పాత్రలు చేయడానికి పెద్దగా ఏమీ లేదు.

వరికుప్పల యాదగిరి అందించిన సంగీతం ఓ మాదిరిగా వుంది. క్లైమాక్స్ కి ముందు వచ్చే మాస్ సాంగ్ మాత్రం ఫరవాలేదు. ఇక రీ రికార్డింగ్ అక్కడక్కడా డైలాగ్స్ ను డామినేట్ చేసేసింది. మరి కొన్ని చోట్ల సన్నివేశానికి సంబంధం లేకుండగా గందరగోళంగా అనిపిస్తుంది. ఫొటోగ్రఫీ ఫరవాలేదు .. అవుట్ డోర్లో తీసిన పాటల దృశ్యాలను అందంగా చిత్రీకరించాడు. ఎడిటింగ్ పరంగా చూసుకుంటే ట్రిమ్ చేయవలసిన సీన్స్ మొదటి నుంచి చివరి వరకూ చాలానే కనిపిస్తాయి. అనవసరం అనిపించే సీన్స్ కూడా లేకపోలేదు.

కథలో బలం .. కథనంలో పట్టు లోపించాయి. సంగీతం .. రీ రికార్డింగ్ పరంగా పడే మార్కులు చాలా తక్కువ. ప్రధాన పాత్రధారి అయిన శ్రీకాంత్ ఉద్దేశాన్ని ఆవిష్కరించే తీరులో స్పష్టత లోపించింది. ఆసక్తికరంగా లేని ఫ్లాష్ బ్యాకులు .. నాటకీయంగా అనిపించే కొన్ని సన్నివేశాలు .. అవసరంలేని కొన్ని పాత్రల కారణంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతుంది.


More Articles
Advertisement
Telugu News
hero heroin get emotion
‘సూపర్‌ ఓవర్‌’ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మంలో హీరో, హీరోయిన్ల క‌న్నీరు!
1 hour ago
sohel goes chiru home
మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లిన బిగ్‌బాస్ ఫేం సోహెల్... ఫొటోలు వైర‌ల్
1 hour ago
I have a deal with Siva Karthikayan says Rakul Preet Singh
శివ కార్తికేయన్ తో ఒక డీల్ కుదుర్చుకున్నా: రకుల్ ప్రీత్ సింగ్
1 hour ago
Chiranjeevi confirms film with Bobby
మరో సినిమాను ఖరారు చేసిన మెగాస్టార్!
2 hours ago
Actress Sri Sudha again complaint against shyam k naidu
సినిమాటోగ్రాఫర్‌ శ్యామ్‌ కె నాయుడిపై సినీ నటి శ్రీసుధ మరోమారు ఫిర్యాదు
5 hours ago
Samanta learning horse riding for her next movie
సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
5 hours ago
Boyapati to direct Tamil hero Surya
సూర్య తెలుగు సినిమా.. బోయపాటి డైరెక్షన్?
20 hours ago
mahesh wishes namrata
నేను ప్రేమించిన అమ్మాయి ఈ రోజే జన్మించింది: మ‌హేశ్ బాబు
23 hours ago
Kajal Aggarwal to pair with Prabhu Deva
ప్రభుదేవా, కాజల్ జంటగా రొమాంటిక్ కామెడీ సినిమా!
1 day ago
Prashanth Neil says salar is not remake of Ugram
ఆ కన్నడ సినిమాకి, 'సలార్'కి సంబంధం లేదంటున్న దర్శకుడు!
1 day ago