ఒక సింపుల్ లైన్ తీసుకుని దానిని తెరపై చాలా బలంగా చెప్పడమనేది మలయాళ సినిమాల విషయంలో కనిపిస్తూ ఉంటుంది. ఫీల్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ, చాలా తక్కువ పాత్రల మధ్య ఎక్కువ ఎమోషన్స్ ను షేర్ చేస్తూ ఉంటారు. అలాంటి ఒక కంటెంట్ తో ఈ ఏడాదిలో మే 12వ తేదీన థియేటర్లకు వచ్చిన సినిమానే 'జానకి జానే'. ఈ సినిమాను మలయాళంతో పాటు, తమిళ .. తెలుగు .. హిందీ భాషల్లో ఈ రోజు నుంచే 'హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ అవుతోంది. కంటెంట్ ఏమిటి? ఎలా ఉంది? అనేది ఇప్పుడు చూద్దాం.,
జానకి (నవ్య నాయర్) ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతోఎం కుటుంబ భారం ఆమెపైనే పడుతుంది. ఓ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తూ .. తల్లితో కలిసి ఉంటూ ఉంటుంది. కాంట్రాక్ట్ పనులు చేసుకునే ఉన్ని ముకుందన్ ( సైజూ కురుప్) కంట్లో జానకి పడుతుంది. ఆమెనే తనకి సరైన జోడీ అని ఆయన భావిస్తాడు. జానకి తల్లితో మాట్లాడి .. ఆ పెళ్లి విషయంలో తన తల్లిదండ్రులను ఒప్పిస్తాడు.
అయితే జానకికి భయం ఎక్కువ .. ఎవరైనా గట్టిగా మాట్లాడినా .. ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లాలన్నా .. ముఖ్యంగా చీకటి అంటే ఆమెకి భయం ఎక్కువ. తన బలహీనత గురించి ముందుగానే ఆమె ఉన్ని ముకుందన్ కి చెబుతుంది. అది పెద్ద సమస్య కాదని అంటూ అతను ఆమెకి ధైర్యం చెబుతాడు. అయితే ఈ పెళ్లి ఉన్ని ముకుందన్ మేనత్త సత్యభామకి ఇష్టం ఉండదు. తనకి బాగా దగ్గరైన శ్రుతి ఆ ఇంటి కోడలు కాకపోవడం ఆమెకి జానకి పై కోపం పెరిగేలా చేస్తూ ఉంటాయి.
ఇక ఆ ఊళ్లో షాజీ (నజీర్) .. మార్టీన్ (జార్జ్ కోరా) మధ్య రాజకీయపరమైన శత్రుత్వం నడుస్తూ ఉంటుంది. ఈ సారి ఎన్నికలలో ఎవరికి వారు తామే గెలవాలనే ఒక పట్టుదలతో ముందుకు వెళుతుంటారు. అలాంటి సమయంలోనే జానకి దంపతులు ఒక ఫంక్షన్ కి వెళతారు. అక్కడికి మార్టీన్ కూడా వస్తాడు. అక్కడ హఠాత్తుగా ట్రాన్స్ పార్మర్ పేలిపోవడంతో, ఒక్కసారిగా చీకటైపోతుంది. భయంతో జానకి పెద్దగా అరుస్తుంది. కరెంట్ వచ్చే సరికి ఆమె మార్టిన్ ను హగ్ చేసుకుని ఉండటం అందరూ చూస్తారు.
ప్రతి పక్షం వారు ఈ అంశాన్ని హైలైట్ చేస్తారు. మార్టీన్ కి జానకితో అక్రమ సంబంధం ఉందంటూ కమీడియాలో వార్తా కథనాలు ప్రసారమవుతూ ఉంటాయి. టీవీ రిపోర్టర్స్ అంతా కూడా జానకి ఇంటిముందే కాచుకుని కూర్చుంటారు. బయటికి వెళ్లడానికి ఆమె భయపడుతూ ఉంటుంది. ఈ విషయంపై మార్టిన్ ను పక్కన పెట్టేయాలనే నిర్ణయానికి పార్టీ పెద్దలు వస్తారు. అతనికి కుదిరిన సంబంధం కూడా వెనక్కి వెళ్లిపోతుంది. ఉన్ని కుందన్ కి జానకిని దూరం చేయడానికి ఇదే సరైన సమయమని సత్యభామ భావిస్తుంది. ఈ సమస్యలను జానకి దంపతులు ఎలా ఎదుర్కొన్నారు? అనేదే కథ.
ఇది గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ. అందమైన లొకేషన్స్ లో .. ఆహ్లాదకరమైన వాతావారణంలో ఈ కథ నడుస్తూ ఉంటుంది. అనీశ్ ఉపాసన రచన - దర్శకత్వం వహించిన సినిమా ఇది. భార్యలోని భయం అనే ఒక బలహీనత కారణంగా తమకి ఒక సమస్య ఎదురైతే, భర్తగా కథానాయకుడు ఎలా అండగా నిలబడ్డాడనే ఒక మెసేజ్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు. నిజానికి పాయింట్ చాలా విషయమున్నదే, కానీ దర్శకుడు దానిని పలచగా చేసి అందించడమే నిరాశను కలిగిస్తుంది.
భయం నుంచి తన భార్యను బయటికి తీసుకుని రావడం కోసం హీరో వైపు నుంచి పెద్దగా చేసే ప్రయత్నాలేం కనిపించవు. అలాగే భయం నుంచి బయటికి రావడానికి హీరోయిన్ వైపు నుంచి జరిగే ప్రయత్నాలు కూడా అంత ఇంట్రెస్టింగ్ గా ఏమీ ఉండవు. అయితే జానకి విషయాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో గెలవాలనుకునేవారు ఆమెను గురించి పట్టించుకోరు. జానకితో మీడియాతో మాట్లాడితే తమ సమస్య తొలగిపోతుందని భావించిన మార్టీన్ వాళ్లు కూడా ఈ విషయంలో అంత యాక్టివ్ గా కనిపించరు.
ఇక జానకితో ఉన్ని ముకుందన్ పెళ్లి జరగడం ఇష్టం లేని అతని మేనత్త సత్యభామ వైఫు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని అనుకుంటాము. కానీ ఆ వైపు నుంచి అల్లుకున్న ట్రాక్ కూడా చప్పగానే అనిపిస్తుంది. మచ్చుకి కూడా కామెడీ - రొమాన్స్ కనిపించవు. చివరి 40 నిమిషాల్లో కథ మరింత చిక్కబడవలసిందిపోయి, మరింత పలచగా మారుతుంది. ఏం జరుగుతుందోననే ఒక టెన్షన్ అటు కథ నడిచే ఊళ్లో కనిపించదు .. ఇటు ప్రేక్షకుల్లోను కనిపించదు.
కొన్ని లొకేషన్స్ .. వాటిని చిత్రీకరించిన తీరు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తాయి. బ్యాక్ఇ గ్రౌండ్క స్కోర్ ఓకే. తెలుగు అనువాదం విషయానికి వస్తే డైలాగ్స్ ఫరవాలేదు. కానీ అనువాదపు పాటలను వినడానికి మాత్రం చాలా సహనం కావాలి. ఆ పాటలను పాడించిన తీరు కూడా కంటెంట్ స్థాయిని తగ్గించేస్తాయి. ఇది థియేటర్స్ కి సరిపోయే కంటెంట్ కాదు .. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ఓ మాదిరిగా అనిపించే సినిమాగానే అనిపిస్తుందంతే.
'జానకి జానే' - (హాట్ స్టార్) మూవీ రివ్యూ
Janaki Jaane Review
- ఈ రోజునే స్ట్రీమింగ్ జరుపుకున్న 'జానకి జానే'
- లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కలిసి సాగే కథ
- మచ్చుకి కూడా కనిపించని కామెడీ - రొమాన్స్
- కథలో బలం .. కథనంలో పట్టులేని సినిమా
- ఏ ట్రాక్ ను సరిగ్గా అల్లుకోకపోవడమే ప్రధానమైన మైనస్
Movie Name: Janaki Jaane
Release Date: 2023-07-11
Cast: Saiju Kurup, Navya Nair, Dhyan Sreenivasan, Sharafudeen,Kottayam Nazeer, Anarkali Marikar
Director:Aniesh Upaasana
Producer: Shenuga - Shegna - Sherga
Music: Kailas Menon
Banner: S Cube Films
Review By: Peddinti
Rating: 2.25 out of 5
Trailer