సజ్జల భార్గవరెడ్డి సహా 16 మందికి పోలీసుల నోటీసులు
- సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు
- వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం
- రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టీకరణ
సోషల్ మీడియాలో తమ నేతలపై అసభ్య, అభ్యంతకర పోస్టులను కూటమి ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించడంలేదు. ఈ క్రమంలో వైసీపీ సోషల్ మీడియా వింగ్ రాష్ట్రస్థాయి నేతలు సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిలకు పోలీసులు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. రేపు (నవంబరు 25) విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వీరితో పాటు మరో 15 మందికి కూడా నోటీసులు ఇచ్చారు.
విజయవాడలో సజ్జల భార్గవరెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు... భార్గవరెడ్డి అక్కడ లేకపోవడంతో అతని తల్లికి నోటీసులు అందించారు. అర్జున్ రెడ్డి కూడా నివాసంలో లేకపోవడంతో నోటీసులు ఇంటికి అంటించారు.
కాగా, సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి దేశం విడిచి వెళ్లకుండా, ఇద్దరిపైనా ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
ఇటీవల కడప పోలీసులు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేయడం తెలిసిందే. అతడిచ్చిన వాంగ్మూలం ఆధారంగానే సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిలకు తాజాగా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.