ఐపీఎల్ వేలంలో సరైనోడ్ని కొనుగోలు చేసిన సన్ రైజర్స్

  • సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఐపీఎల్ మెగా ఆక్షన్
  • మహ్మద్ షమీని సొంతం చేసుకున్న సన్ రైజర్స్
  • షమీని రూ.10 కోట్లతో కొనుగోలు చేసిన హైదరాబాద్ ఫ్రాంచైజీ
సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ ఆటగాళ్ల వేలం అత్యంత ఆసక్తికరంగా కొనసాగుతోంది. వేలం ప్రారంభమైన కొన్ని గంటల్లోనే అత్యధిక ధర రికార్డులు రెండు సార్లు బద్దలయ్యాయి. శ్రేయాస్ అయ్యర్ ను రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేయగా... కాసేపటికే రిషబ్ పంత్ ను రూ.27 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. 

ఇక, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఈ వేలంలో నికార్సయిన పేస్ బౌలర్ ను సొంతం చేసుకుంది. బుల్లెట్ బంతులతో వికెట్లు తీసే మహ్మద్ షమీని రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది. 

షమీ గత సీజన్ లో గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవల అతడిని గుజరాత్ ఫ్రాంచైజీ విడుదల చేసింది. వేలానికి వచ్చిన షమీని... సన్ రైజర్స్ యాజమాన్యం పక్కా ప్రణాళికతో కొనుగోలు చేసింది. షమీ కనీస ధర రూ.2 కోట్లు కాగా, అతడి కోసం ఇతర ఫ్రాంచైజీలు ఏమంత పోటీపడలేదు. చివరికి ఎస్ఆర్ హెచ్ షమీని రూ.10 కోట్లతో లాక్ చేసింది.

నేటి వేలంలో ఇప్పటివరకు అమ్ముడైన ఇతర స్టార్ ఆటగాళ్ల వివరాలు
  • యజువేంద్ర చహల్- రూ.18 కోట్లు (పంజాబ్ కింగ్స్)
  • జోస్ బట్లర్- రూ.15.75 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
  • కేఎల్ రాహుల్- రూ.14 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
  • మహ్మద్ సిరాజ్-  రూ.12.25 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
  • మిచెల్ స్టార్క్- రూ.11.75 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
  • కగిసో రబాడా- రూ.10.75 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
  • లియామ్ లివింగ్ స్టన్- రూ.8.75 కోట్లు (ఆర్సీబీ)
  • డేవిడ్ మిల్లర్- రూ.7.50 కోట్లు (లక్నో సూపర్ జెయింట్స్)



More Telugu News