ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు రిషబ్ పంత్... ధర అదరహో!

  • పంత్ ను రూ.27 కోట్లతో కొనుగోలు చేసిన లక్నో
  • ఐపీఎల్ లో ఇదే రికార్డు ధర
  • అయ్యర్ ను రూ.26.75 కోట్లతో కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. పంత్ ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. 2008లో ఐపీఎల్ ప్రారంభం అయ్యాక ఏ ఆటగాడికి ఇంత ధర పలకలేదు. పంత్ కోసం ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా పోటీ పడినప్పటికీ, పోటీ తీవ్రం కావడంతో మధ్యలోనే డ్రాప్ అయింది. చివరికి పంత్ ను ఎల్ఎస్ జీ రికార్డు ధరకు సొంతం చేసుకుంది. 

ఇవాళే రెండు రికార్డులు బద్దలు కావడం విశేషం. గత సీజన్ లో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్లతో రికార్డు సృష్టించగా.... శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్లతో ఆ రికార్డును బద్దలు కొట్టాడు. నేటి ఐపీఎల్ మెగా వేలంలో శ్రేయాస్ అయ్యర్ ను రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. కానీ ఆ రికార్డు కాసేపట్లోనే తెరమరుగైంది. పంత్ ను కళ్లు చెదిరే ధర (రూ.27 కోట్ల )తో లక్నో ఎగరేసుకెళ్లింది.





More Telugu News