పంటను కాపాడుకునేందుకు ఓ రైతు ఏంచేశాడో చూడండి!

  • మొక్కజొన్న పొలం చుట్టూ మైక్ లు ఏర్పాటు చేసిన రైతు
  • హోయ్ అనే అరుపును పదే పదే వినిపించేలా ఏర్పాటు
  • నెట్టింట వీడియో వైరల్ 
ఆరుగాలం శ్రమించి రైతన్న పంట పండించి ప్రజల ఆహార అవసరాలు తీర్చుతుంటాడు. అయితే, విత్తు నాటినప్పటి నుంచి పంట చేతికొచ్చేంత వరకు రైతులకు అనేక రూపాల్లో కష్టనష్టాలు పొంచి ఉంటాయి. పక్షులు, జంతువులు కూడా పంటలను ఆశించి, నష్టం కలుగజేస్తుంటాయి. అయితే, ఓ రైతు తన మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు కొత్తగా ఆలోచించాడు. 

ఇంతకీ ఆ రైతన్న ఏం చేశాడంటే... పక్షులను "హోయ్" అని తరుముతున్నట్టుగా తన వాయిస్ ను రికార్డ్ చేశాడు. తన పొలం నాలుగు మూలల్లో నాలుగు మైక్ లు ఏర్పాటు చేసి, "హోయ్" అనే అరుపు పదే పదే వినిపించేలా ఏర్పాటు చేశాడు. దాంతో, పక్షులు నిజంగా అక్కడ మనుషులు ఉన్నారని భావించి దూరంగా వెళ్లిపోతాయన్నది రైతు ఆలోచన. 

ఇది బాగానే వర్కవుట్ కావడంతో, ఇతర రైతులు కూడా ఈ మైక్ ఎత్తుగడను ఫాలో అవుతున్నారు. దీని తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 


More Telugu News