పెర్త్ టెస్టు.. ఆసీస్ ఆలౌట్.. భారత్‌కు స్పల్ప ఆధిక్యం
- పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు
- తొలి ఇన్నింగ్స్ లో 104 రన్స్‌కే ఆసీస్ ఆలౌట్
- అంతకుముందు మొదటి ఇన్నింగ్స్ లో 150 పరుగులు చేసిన భారత్
- దాంతో టీమిండియాకు 46 పరుగుల స్వల్ప ఆధిక్యం
- 5 వికెట్లతో రాణించిన కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్ లో 104 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్‌నైట్ స్కోర్ 67 పరుగులతో రెండో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ మరో 37 పరుగులు జోడించి మిగతా మూడు వికెట్లు కోల్పోయింది.
అంతకుముందు భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 150 రన్స్‌కి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియాకు 46 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఆలెక్స్ కేరీ 21, మిచెల్ స్టార్క్ 26 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు.
కాగా, 79 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను స్టార్క్, హెజిల్‌వుడ్ ద్వయం ఆదుకుంది. చివరి వికెట్‌కు ఈ జోడి 25 పరుగుల కీలకమైన భాగస్వామ్యం అందించింది. వీరిద్దరూ ఏకంగా 110 బంతులు ఎదుర్కొని కొద్దిసేపు భారత బౌలర్లను పరీక్షించారు.
టీమిండియా బౌలర్లలో కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో కంగారులను హడలెత్తించాడు. ఇక అరంగేట్ర మ్యాచ్ ఆడుతున్న యువ పేసర్ హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టాడు. అలాగే మరో పేసర్ మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీశాడు.