చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం... ఉద్యోగాల జాతరకు రంగం సిద్ధం
- ఏపీలో పెట్టుబడులు పెట్టే సంస్థలపై చర్చ
- ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ప్రోత్సాహకాలు
- పరిశ్రమలకు అనుమతులు, భూకేటాయింపులకు ఆమోదం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు రాష్ట్ర సచివాలయంలో ఎస్ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్)కి సంబంధించి తొలి సమావేశం జరిగింది. ఏపీలో వివిధ సంస్థల పెట్టుబడుల ప్రతిపాదనలు, ఎంవోయూలు, ఒప్పందాల పురోగతి వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. గతంలో జరిగిన వివిధ ఒప్పందాలను, వాటి ప్రస్తుత స్థితిగతులను కూడా సమీక్షించారు.
ఈ సమావేశంలో రూ,85 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. 33,966 వేల ఉద్యోగాలు కల్పించే 10 పరిశ్రమలకు అనుమతుల మంజూరు, భూ కేటాయింపులకు పచ్చజెండా ఊపారు.
1. ఆర్సెలర్ మిట్టల్ అండ్ నిప్పన్ స్టీల్ ప్లాంట్- రూ.61,780 కోట్లు (21 వేల ఉద్యోగాలు)
2. ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్- రూ.5,001 కోట్లు (1,495 ఉద్యోగాలు)
3. కల్యాణి స్ట్రాటజీ సిస్టమ్స్ లిమిటెడ్- రూ.1,430 కోట్లు (565 ఉద్యోగాలు)
4. టాఫే ఫారేషియా ఇండియా లిమిటెడ్- రూ.76 కోట్లు (250 ఉద్యోగాలు)
5. ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్- రూ.3,798 కోట్లు (200 ఉద్యోగాలు
6. ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్- రూ.1,046 కోట్లు ( 2,381 ఉద్యోగాలు)
7. డల్లాస్ టెక్నాలజీ సెంటర్ ఎల్ఎల్ పీ- రూ.50 కోట్లు (2 వేల ఉద్యోగాలు)
8. ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్- రూ.8,240 కోట్లు (4 వేల ఉద్యోగాలు)
9. గ్రీన్ కో సోలార్ ఐఆర్ఈపీ లిమిటెడ్- రూ.2 వేల కోట్లు (1,725 ఉద్యోగాలు)
10. ఎకోరెన్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ రూ.1,662 కోట్లు (350 ఉద్యోగాలు)
ఆయా సంస్థలు ఇచ్చే ఉద్యోగాల సంఖ్యను బట్టి ప్రోత్సాహకాలు ఇవ్వాలని నేటి ఎస్ఐపీబీ సమావేశంలో నిర్ణయించారు. ఇటీవల ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానానికి అనుగుణంగా ప్రోత్సాహకాలు ఉండనున్నాయి.
కాగా, ఎస్ఐపీబీ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు.