సౌదీలో అష్టకష్టాలు పడుతున్నాను... కాపాడండి!: మంత్రి లోకేశ్ కు కడప మహిళ కన్నీటి వేడుకోలు

  • కడప నుంచి సౌదీ అరేబియా వెళ్లిన షకీలా బాను
  • ఓ మతి స్తిమితం లేని మహిళ వద్ద పనికి కుదిరిన వైనం
  • షకీలా బానును చిత్రహింసలకు గురిచేసిన వృద్ధురాలు
  • ఇంటి నుంచి గెంటివేసిన వైనం
  • కన్నీటిపర్యంతమవుతూ కుటుంబ సభ్యులకు వీడియో పంపిన మహిళ
బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలు వెళ్లిన ఏపీకి చెందిన వారు, ఏజెంట్ల చేతిలో మోసపోయి, యజమానుల వద్ద చిత్రహింసలకు గురవుతున్న ఘటనలు ఇటీవల కాలంలో తరచుగా తెరపైకి వస్తున్నాయి. ఏపీ మంత్రి నారా లోకేశ్ చొరవతో పలువురు తెలుగు వారు అరబ్ దేశాల్లో యజమానుల చెర నుంచి సురక్షితంగా బయటపడ్డారు. 

తాజాగా, కడపకు చెందిన ఓ మహిళ తాను సౌదీ అరేబియాలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, తనను నారా లోకేశ్ ఆదుకోవాలని కన్నీటితో వేడుకుంది. కడపలోని రవీంద్రనగర్ కు చెందని షకీలా బాను కొన్నినెలల కిందటే ఓ ఏజెంట్ ద్వారా సౌదీ అరేబియా వెళ్లింది. 

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తాను... సౌదీలో నాలుగు డబ్బులు వెనకేసుకోవచ్చని ఆమె సంతోషపడింది. ఆ ఏజెంట్ ఆమెను మతి స్తిమితం లేని ఓ వృద్ధురాలి వద్ద పనికి కుదిర్చాడు. 

అయితే, ఆ వృద్ధురాలు తనను చిత్రహింసలు పెట్టిందని, ఇంటి నుంచి గెంటివేశారని చెబుతూ షకీలా బాను ఓ వీడియోను తన కుటుంబ సభ్యులకు పంపించింది. నారా లోకేశ్ స్పందించి, తన సౌదీ నుంచి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె కన్నీటి పర్యంతమైంది. 


More Telugu News