రేవంత్ రెడ్డి అప్పుల కోసం ఏకంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు: కిషన్ రెడ్డి

  • కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శ
  • బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని ఆగ్రహం
  • కేసీఆర్, రేవంత్ రెడ్డి నైతిక విలువలు వదిలేశారని వ్యాఖ్య
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పులు చేస్తే... రేవంత్ రెడ్డి అప్పుల కోసం ఏకంగా ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ హయాంలో ఎలాగైతే అవినీతి జరిగిందో, ఇప్పుడు అదే కనిపిస్తోందని, అప్పుడు ఎలాగైతే గాలిమాటలు చెప్పారో ఇప్పుడూ అలాగే చెబుతున్నారన్నారు. వీటితో ప్రజలు విసిగిపోతున్నారని తెలిపారు.

కేసీఆర్, రేవంత్ రెడ్డి రాజకీయాల్లో నైతిక విలువలు వదిలేశారన్నారు. రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదన్నారు. రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగడం దారుణమని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. బీజేపీ నిర్మాణాత్మక రాజకీయాలే చేస్తోందన్నారు. తెలంగాణలో పని చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉండి భ్రష్టు పట్టించిందన్నారు.


More Telugu News