ఏ బుల్డోజర్‌తో ఏ ఇల్లు కూలగొడతారో అనే భయం ఉంది: కిషన్ రెడ్డి
- మూసీ బాధితుల పక్షాన పోరాటం చేసే బాధ్యతను బీజేపీ తీసుకుంటోందన్న కిషన్ రెడ్డి
- హైడ్రా కారణంగా ప్రజలు తీవ్ర ఆందోళనగా ఉన్నారన్న కేంద్రమంత్రి
- భరోసా కల్పించేందుకే తాము మూసీ నిద్ర చేపడున్నామని వెల్లడి
హైడ్రా పేరుతో ఎప్పుడు ఏ బుల్డోజర్‌తో... ఏ ఇల్లును కూలగొడతారో అనే భయంతో మూసీ పరీవాహక ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈరోజు సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మూసీ బాధితుల పక్షాన పోరాటం చేసే బాధ్యతను బీజేపీ తీసుకుంటోందన్నారు. బాధితులు నివాసం ఉంటున్న వివిధ ప్రాంతాల్లో ఈ రోజు బీజేపీ నేతలు బస చేస్తున్నట్లు చెప్పారు. తాను అంబర్‌పేటలోని తులసీనగర్‌లో నిద్రిస్తున్నానన్నారు.
ప్రజలకు బీజేపీ తరఫున భరోసా కల్పించేందుకు తాము బస్తీల్లో రాత్రి బస చేస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ మూసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు.
తులసీ నగర్ చేరుకున్న కిషన్ రెడ్డి
బీజేపీ మూసీ నిద్రలో భాగంగా కిషన్ రెడ్డి తులసి నగర్‌లో బస చేస్తున్నారు. ఈ క్రమంలో సాయంత్రం ఆయన ఇక్కడకు చేరుకున్నారు. స్థానిక ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. మూసీ బాధితులకు న్యాయం జరగాలని తమ పార్టీ నాలుగు నెలలుగా పోరాటం చేస్తోందని స్థానికులకు తెలిపారు. బాధితులతో ఇప్పటికే ధర్నా కూడా నిర్వహించామని గుర్తు చేశారు.