నటుడు పోసాని కృష్ణమురళిపై కడపలో కేసు నమోదు
- పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీసీ సెల్, ఎస్సీ సెల్ నేతల ఫిర్యాదు
- పోసానిపై ఇప్పటికే 50కిపైగా కేసుల నమోదు
- మరో రెండు రోజుల్లో పోసానికి నోటీసులు జారీచేస్తామన్న పోలీసులు
ప్రముఖ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై ఏపీలో వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఆయనపై ఇప్పటి వరకు 50కి పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా కడప జిల్లాలోని రిమ్స్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు వెంకట సుబ్బయ్య, నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. రాజంపేట పోలీస్ స్టేషన్లోనూ వీరు ఫిర్యాదు చేయడం గమనార్హం.
మరోవైపు, అనంతపురం తెలుగు యువత, ఎస్సీ సెల్ నాయకులు పోసాని దిష్టిబొమ్మను దహనం చేశారు. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో పోసానిని విచారణకు పిలుస్తామని, రెండుమూడు రోజుల్లో నోటీసులు జారీ చేస్తామని పోలీసులు తెలిపారు. మరోవైపు, సినీనటి శ్రీరెడ్డిపైనా రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.