బుల్డోజర్తో తొక్కిస్తామని ముఖ్యమంత్రి అంటారా?: కిషన్ రెడ్డి ఆగ్రహం
- మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదన్న కిషన్ రెడ్డి
- పేదల ఇళ్లు కూల్చకుండానే మూసీ ప్రక్షాళన చేయవచ్చునని వ్యాఖ్య
- చర్చల ద్వారా పరిష్కారమయ్యే అంశం కలెక్టర్‌పై దాడి వరకు వెళ్లిందన్న కేంద్రమంత్రి
మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే బుల్డోజర్తో తొక్కిస్తామని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అనవచ్చా? అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, కానీ పేదల ఇళ్లు కూల్చడానికి తాము వ్యతిరేకమన్నారు. పేదల ఇళ్లు కూల్చకుండానే మూసీ ప్రక్షాళన చేయవచ్చన్నారు. తెలంగాణ ప్రభుత్వం వద్ద ఎంత డబ్బు ఉంది... ప్రక్షాళనకు ఎంత ఖర్చవుతుందో లెక్కలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన కోసం అవసరమైతే తామే మొదటి తట్ట ఎత్తుతాం... మొదటి పార తీస్తామన్నారు.
బేగంపేట పర్యాటక భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదన్నారు. పంటలకు ఇస్తామన్న బోనస్ కూడా ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. ఆలయాలపై దాడులు జరుగుతుంటే పోలీసులతో పాటు ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు.
గతంలో ఫాం హౌస్ వీడియోలను ఉపయోగించుకొని బీఆర్ఎస్ పార్టీ ఎలా రాజకీయం చేసిందో... ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తోందని ఆరోపించారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై కూడా కిషన్ రెడ్డి స్పందించారు. చర్చల ద్వారా పరిష్కారం కావాల్సిన విషయం కలెక్టర్ మీద దాడి వరకు ఎందుకు వెళ్లిందో ఆలోచించాలన్నారు. అసలు తెలంగాణలో ఇలాంటి అంశాలు ఎక్కడికి వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మజ్లిస్ పార్టీ ఆదేశాలతో కమిషనర్‌ను బదిలీ చేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ డీఎన్ఏలోనే చిత్తశుద్ధి అనేది లేదన్నారు. బీఆర్ఎస్ కూడా అక్కడి నుంచే పుట్టిందని, కాబట్టి ఆ పార్టీ డీఎన్ఏ కూడా అదేనని విమర్శించారు. మీరు మమ్మల్ని తిట్టినట్లు చేయండి... మేం మిమ్మల్ని విమర్శించినట్లు చేస్తామన్న తీరు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కనిపిస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలా మారిందని ఆరోపించారు. మన వద్ద మాత్రం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలంగాణ భారీగా నష్టపోతుందని హెచ్చరించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలు, తిట్లతో రాజకీయాలు చేయాలనుకుంటున్నాయని, కానీ దాంతో ఒరిగేదేమీ లేదన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ నేతలు తిట్టినా, రాహుల్ గాంధీ కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులు తిట్టినా తెలంగాణకు ఒరిగేదేమీ లేదన్నారు. ఈరోజు తెలంగాణలో ధాన్యం, పత్తి కొనుగోలు జరుగుతోందంటే అందుకు కేంద్ర ప్రభుత్వమే కారణం అన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి మోదీ ప్రభుత్వం వల్లే జరుగుతోందన్నారు. కేంద్రం నిధులతోనే బస్తీ దవాఖానాలు నడుస్తున్నాయన్నారు. తాము కేసులకు భయపడేది లేదని... ఇలాంటి వారిని చాలామందిని చూశామన్నారు.