Lagacharla Incident: సంగారెడ్డి జైలులో లగచర్ల రైతులను విచారించిన ఎన్ హెచ్ఆర్ సీ

NHRC questions Lagacharla farmers in Sangareddy prison

  • ఇటీవల లగచర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ పై దాడి
  • రైతులపై కేసులు... అరెస్టయి సంగారెడ్డి జైలులో ఉన్న రైతులు
  • రైతులను 5 గంటల పాటు విచారించిన మానవ హక్కుల కమిషన్
  • ఈ వివాదాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్ హెచ్ఆర్ సీ

ఇటీవల వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో భూసేకరణ సభ హింసాత్మకంగా మారడం తెలిసిందే. రైతులు, గ్రామస్తులు జిల్లా కలెక్టర్ పై దాడి చేశారు. దాంతో రైతులపై పోలీసు కేసులు నమోదు కాగా, అరెస్టయిన రైతులు ప్రస్తుతం సంగారెడ్డి జైలులో ఉన్నారు. 

కాగా, ఈ వివాదాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్ సీ) సుమోటోగా తీసుకుంది. ఈ క్రమంలో, నేడు సంగారెడ్డి జైలులో లగచర్ల రైతులను కలిసిన ఎన్ హెచ్ఆర్ సీ ప్రతినిధులు విచారణ జరిపారు. ఈ విచారణ కొద్ది సేపటి కిందట ముగిసింది. 

ఎన్ హెచ్ఆర్ సీ డిప్యూటీ రిజిస్ట్రార్ ముఖేశ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులు, వికారాబాద్ జిల్లా అధికారులు ఈ విచారణలో పాలుపంచుకున్నారు. ఈ మధ్యాహ్నం ప్రారంభమైన విచారణ దాదాపు 5 గంటల పాటు సాగింది. లగచర్ల కేసులో పూర్తి విచారణ చేపట్టాలని ఎన్ హెచ్ఆర్ సీ నిర్ణయించింది. ఈ విచారణ ఈ నెల 26 వరకు కొనసాగనుంది.

  • Loading...

More Telugu News