Stock Market: అమ్మకాల ఒత్తిడి.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 241 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 78 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 3 శాతానికి పైగా పతనమైన టీసీఎస్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాలను మూటకట్టుకున్నాయి. విదేశీ మదుపరుల అమ్మకాలు, బలహీనంగా ఉన్న పలు సంస్థల త్రైమాసిక ఫలితాల కారణంగా సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 600 పాయింట్లు కోల్పోయింది. ఆ తర్వాత కాస్త కోలుకుంది.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 241 పాయింట్లు కోల్పోయి 77,339కి దిగజారింది. నిఫ్టీ 78 పాయింట్లు నష్టపోయి 23,453 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 84.40గా ఉంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (2.39%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.44%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.37%), నెస్లే ఇండియా (1.35%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.20%).
టాప్ లూజర్స్:
టీసీఎస్ (-3.05%), ఇన్ఫోసిస్ (-2.82%), ఎన్టీపీసీ (-1.56%), టెక్ మహీంద్రా (-1.50%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.41%).