Beauticians: బ్యూటీషియన్ల కోసం కేంద్రం కొత్త పథకం

Centre new program for beauty care entrepreneurs

  • నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో డబ్ల్యూఈపీ వేదిక
  • ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో వేదిక
  • అర్బన్ కంపెనీతో కలిసి పైలెట్ ప్రాజెక్టు ప్రకటించిన కేంద్రం 

సౌందర్యాలంకరణ రంగంలో ఉన్న వారి కోసం కేంద్రం కొత్త పథకం ప్రకటించింది. దీనిపేరు ది ఉమెన్ ఆంట్రప్రెన్యూర్ షిప్ ప్లాట్ ఫాం (డబ్ల్యూఈపీ). ఇది నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నడిచే ఒక వేదిక. అర్బన్ కంపెనీ భాగస్వామ్యంతో నేడు పైలెట్ ప్రాజెక్టును ప్రకటించారు. 

బ్యూటీషియన్లు, ఆరోగ్య పరిరక్షణ రంగంలో పనిచేస్తున్న వారికి ఈ పథకం ద్వారా చేయూతనివ్వనున్నారు. ఈ పథకం ద్వారా బ్యూటీషియన్లు, తదితరులు తమ వ్యాపారాలను మెరుగుపర్చుకునేందుకు తోడ్పాటు అందించనున్నారు. 

ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతంలో ఈ పథకం పైలెట్ ప్రాజెక్టు కోసం 25 మందిని ఎంపిక చేయనున్నారు. స్కిల్లింగ్, లీగల్, కాంప్లయన్స్, ఫైనాన్షియల్ యాక్సెస్, మార్కెట్, బిజినెస్ డెవలప్ మెంట్ సర్వీసుల్లో ఆ మహిళలకు శిక్షణ ఇవ్వనున్నారు.

  • Loading...

More Telugu News