Koratala Siva: కాలినడకన తిరుమల కొండెక్కిన కొరటాల శివ

Koratala Siva arrives Tirumal by walk

  • కుటుంబ సమేతంగా తిరుమల విచ్చేసిన కొరటాల శివ
  • అలిపిరి నుంచి మెట్లమార్గం ద్వారా కొండపైకి చేరిక
  • ప్రస్తుతం ఎన్టీఆర్ తో దేవర చిత్రం తెరకెక్కిస్తున్న కొరటాల

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కుటుంబ సమేతంగా తిరుమల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. ఆయన అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకున్నారు. సాధారణ భక్తుల మాదిరిగా ఆయన మెట్ల మార్గంలో నడిచారు. ఈ సందర్భంగా ఆయన ఎంతో నిరాడంబరంగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో రూపుదిద్దుకున్న దేవర చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో వారం రోజుల్లో దేవర చిత్రం రిలీజ్ కానున్న నేపథ్యంలో కొరటాల స్వామివారి దర్శనానికి వచ్చినట్టు తెలుస్తోంది. దేవర మూవీలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. 

జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్-కొరటాల కాంబోలో వస్తున్న దేవర చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. 

దేవర చిత్రం సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుండగా... 22వ తేదీన హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిత్రబృందం ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News