Delhi Capitals: లక్నోతో పోరు... టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్

Delhi Capitals Win Toss Opt to Bowl Against Lucknow
  • ఐపీఎల్ లో ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ × లక్నో సూపర్ జెయింట్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ
  • లక్నోలోని వాజ్ పేయి స్టేడియంలో మ్యాచ్
ఐపీఎల్ లో ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు లక్నోలోని వాజ్ పేయి స్టేడియం వేదికగా నిలుస్తోంది. 

టాస్ సందర్భంగా ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ, ఈ మ్యాచ్ కు మీడియం పేసర్ మోహిత్ శర్మ స్థానంలో దుష్మంత చమీర ఆడుతున్నాడని వెల్లడించాడు. మరోవైపు, తమ జట్టులో ఎలాంటి మార్పులు లేవని లక్నో సూపర్ జెయింట్స్ సారథి రిషబ్ పంత్ తెలిపాడు.

పాయింట్ల విషయానికొస్తే... ఢిల్లీ జట్టు 7 మ్యాచ్ ల్లో 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, లక్నో జట్టు 8 మ్యాచ్ ల్లో 10 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.
Delhi Capitals
IPL 2023
Lucknow Super Giants
Axar Patel
Rishabh Pant
Mohit Sharma
Dushmantha Chameera
Cricket Match
IPL Points Table
Vazpayee Stadium

More Telugu News