Sampurnesh Babu: ఇప్పటికీ రెంట్ ఇంట్లోనే ఉంటున్నా: హీరో సంపూ

- యూత్ లో సంపూకి మంచి క్రేజ్
- కొంత కాలంగా లేని హిట్
- తాజా చిత్రంగా రూపొందిన 'సోదరా'
- బస్సులోనే తిరుగుతుంటానన్న సంపూ
సంపూర్ణేశ్ బాబుకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. 'కొబ్బరిమట్ట' తరువాత ఆయన నుంచి హిట్ లేకపోయినా, ఆయన క్రేజ్ మాత్రం అలాగే ఉంది. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'సోదరా' సిద్ధమవుతోంది. మన్మోహన్ మైనంపల్లి ఈ సినిమాకి దర్శకుడు. సంపూతో పాటు సంజోష్, ఆర్తి, ప్రాచీ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 25వ తేదీన థియేటర్లకు రానుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో సంపూ బిజీగా ఉన్నాడు. 'ఐ డ్రీమ్'వారితో ఆయన మాట్లాడుతూ... నేను హైదరాబాద్ వస్తే 'మణికొండ'లో ఉంటాను. అది నా సొంత ఇల్లు కాదు... రెంట్ కే ఉంటున్నాను. నాకు కారు ఉంది... అలాగని చెప్పి బస్సులలో తిరగడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. సమయానికి డ్రైవర్ దొరక్కపోతే, బస్సులలోనే తిరుగుతూ ఉంటాను. బస్సులలో తెలిసినవాళ్లు పలకరిస్తూ ఉంటారు... ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు" అని చెప్పాడు.
ఒకప్పుడు కారు లేకపోవడం వలన బస్సులో తిరిగాను... ఇప్పుడు కారు ఉంది గనుక బస్సులలో తిరగకూడదు అని నేను అనుకోను. నా ఒక్కడి కోసం కారు అవసరమా అనుకున్నా నేను బస్సులలోనే ప్రయాణం చేస్తూ ఉంటాను. ఆ విషయాన్ని గురించి నేను అంతగా ఆలోచన చేయను. మా ఊళ్లో నా షాపు ఇప్పటికే అలాగే ఉంది. ప్రస్తుతం అది మా అన్నయ్య చూసుకుంటున్నాడు" అని అన్నాడు.