Donald Trump: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ డ్యాన్స్ చూస్తారా.. వీడియో ఇదిగో!

––
అగ్రరాజ్యం అధ్యక్షుడిగా నిత్యం బిజీబిజీగా గడిపే డొనాల్డ్ ట్రంప్ ఆదివారం కాస్త విరామం తీసుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన రెజ్లింగ్ పోటీలు చూసేందుకు వెళ్లారు. ఫ్లోరిడాలోని మియామీలో జరుగుతున్న అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్ షిప్ కార్యక్రమానికి హాజరయ్యారు. ట్రంప్ కు గతంలో వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ లో భాగస్వామ్యం ఉండేది. అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్ షిప్ కార్యక్రమాలకు తరచూ హాజరయ్యేవారు. ప్రముఖ రెజ్లర్లతో ఆయను స్నేహం కూడా ఉంది. అయితే, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక సమయం దొరకకపోవడంతో ఈ కార్యక్రమాలకు దూరమయ్యారు.
తాజాగా ఆదివారం ట్రంప్ ఈ కార్యక్రమానికి హాజరుకావడంతో స్టేడియంలో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ట్రంప్ క్యాప్ లు ధరించి డ్యాన్స్ చేశారు. దీంతో ట్రంప్ కూడా స్పందించి వారిని ఉత్సాహపరిచేందుకు తాను కూడా కాలు కదిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, ఈ కార్యక్రమానికి ట్రంప్ తో పాటు ఎలాన్ మస్క్, రాబర్ట్ ఎఫ్.కెన్నెడీ జూనియర్, కాష్ పటేల్, మార్కో రూబియో, తులసీ గబ్బార్డ్, ట్రంప్ మనవరాలు కాయ్ ట్రంప్ తదితరులు హాజరయ్యారు.