MS Dhoni: సీఎస్‌కే ఇలా ఓడిపోవడం ఐపీఎల్‌ చరిత్రలోనే ఇది తొలిసారి

Five Consecutive Losses for CSK An IPL First

             


ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టును వరుస పరాజయాలు వెక్కిరిస్తున్నాయి. గత రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దారుణ పరాభవాన్ని చవిచూసింది. సొంతగడ్డపై పేలవ ఆటతీరుతో ధోనీ సేన విమర్శలు మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో చెన్నైని 103 పరుగులకే కట్టడి చేసిన కేకేఆర్.. ఆపై రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సగం ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఆరు మ్యాచ్‌లు ఆడిన చెన్నైకి ఇది వరుసగా 5వ ఓటమి కావడం గమనార్హం. ఐపీఎల్‌లో ఒక జట్టు వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి. అంతేకాదు, చెన్నైలో ఆ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. పాయింట్ల పట్టికలో చెన్నై ఇప్పుడు కింది నుంచి రెండో స్థానంలో ఉంది.

MS Dhoni
Chennai Super Kings
CSK
IPL 2023
KKR
Kolkata Knight Riders
IPL history
Five consecutive losses
Lowest IPL score
Chennai Super Kings defeat
  • Loading...

More Telugu News