Nicholas Pooran: రాణించిన పూరన్, బదోనీ... సమద్ మెరుపులు... లక్నో 171-7

- ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ × లక్నో సూపర్ జెయింట్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
- 3 వికెట్లు తీసిన అర్షదీప్ సింగ్
పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఓ మోస్తరు స్కోరు చేసింది. నికోలాస్ పూరన్ (44), ఆయుష్ బదోనీ (41) రాణించగా... అబ్దుల్ సమద్ (12 బంతుల్లో 27 రన్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. పూరన్ 5 ఫోర్లు, 2 సిక్సులు కొట్టగా... బదోనీ 1 ఫోర్, 3 సిక్సులు బాదాడు. సమద్ 2 ఫోర్లు, 2 సిక్సులతో అలరించాడు.
ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ 28 పరుగులు చేయగా, మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ (0) డకౌట్ అయ్యాడు. కెప్టెన్ రిషబ్ పంత్ (2) మరోసారి పేలవంగా ఆడి అవుటయ్యాడు. అటాకింగ్ బ్యాట్స్ మన్ డేవిడ్ మిల్లర్ 19 పరుగులు చేశాడు.
పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3 వికెట్లతో రాణించాడు. ఫెర్గుసన్ 1, మ్యాక్స్ వెల్ 1, మార్కో యన్సెన్ 1, చహల్ 1 వికెట్ తీశారు. ఎంతో ప్రమాదకరమైన నికోలాస్ పూరన్ వికెట్ చహల్ కు దక్కింది.