Zomato: 500 మంది ఉద్యోగులను తొలగించిన జొమాటో

Zomato Lays Off 500 Employees

  • నియామకాలు చేపట్టిన దాదాపు ఏడాది లోపే తొలగింపులు!
  • జోమాటో అసోసియేట్ యాక్సిలరేటర్ ప్రోగ్రాం పేరిట నియామకాలు చేపట్టిన జొమాటో
  • పేలవమైన పనితీరు కారణంగా నోటీసు పీరియడ్ ఇవ్వకుండానే తొలగింపు

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగించింది. కస్టమర్ సపోర్ట్ అసోసియేట్స్‌గా పనిచేస్తున్న వారిని విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. నియామకాలు చేపట్టిన ఏడాదిలోపే ఈ తొలగింపులు చోటు చేసుకోవడం గమనార్హం.

జొమాటో అసోసియేట్ యాక్సిలరేటర్ ప్రోగ్రాం ద్వారా ఏడాది క్రితం సుమారు 1,500 మందిని కస్టమర్ సపోర్ట్ విభాగంలో జొమాటో నియమించింది. తొలగించిన 500 మంది ఉద్యోగుల్లో చాలామంది పనితీరు సరిగా లేకపోవడం, సమయపాలన పాటించకపోవడం వంటి కారణాల వల్ల నోటీసు పీరియడ్ లేకుండానే తొలగించినట్లు తెలుస్తోంది. అయితే, వీరికి ఒక నెల వేతనాన్ని పరిహారంగా చెల్లించినట్లు సమాచారం.

కస్టమర్ సపోర్ట్ విధానాలను ఆటోమేట్ చేయడంతోపాటు, వ్యయాలను తగ్గించుకునేందుకు కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- AI)ను వినియోగించాలని జొమాటో యోచిస్తోంది. ఈ క్రమంలోనే 500 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల తొలగింపుపై జొమాటో యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Zomato
Job Cuts
Layoffs
Food Delivery
Customer Support
Artificial Intelligence
AI
Cost Cutting
Automation
India
  • Loading...

More Telugu News