Donald Trump: అటు పుతిన్ కు, ఇటు జెలెన్ స్కీకి... ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్

Trump Warns Putin and Zelensky

  • యుద్ధం ముగింపునకు తనదైన శైలిలో ప్రయత్నిస్తున్న ట్రంప్
  • ఉక్రెయిన్ లో రక్తపాతం ఆగకపోతే పుతిన్ దే బాధ్యత అని వెల్లడి
  • అదే  జరిగితే  పుతిన్ ను ఉపేక్షించబోనని హెచ్చరిక
  • అరుదైన ఖనిజాల ఒప్పందం నుంచి ఉక్రెయిన్ వైదొలగితే కష్టాలు తప్పవని స్పష్టీకరణ

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడానికి తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీలకు కీలక సందేశాలు పంపారు. తమ మాట వినకపోతే ఉపేక్షించేది లేదన్న కోణంలో స్పష్టమైన సంకేతాలు పంపారు. 

యుద్ధం కొనసాగితే పుతిన్‌ను ఉపేక్షించేది లేదని, రష్యాపై భారీ సుంకాలు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌లో రక్తపాతం ఆగకపోతే పుతిన్‌దే బాధ్యత అని ఆయన అన్నారు. అయితే, జెలెన్ స్కీకి కూడా ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఉక్రెయిన్ ఎప్పటికీ నాటోలో చేరకూడదని, ఒకవేళ ఉక్రెయిన్ అరుదైన ఖనిజాల ఒప్పందం నుంచి వైదొలగాలని చూస్తే కష్టాలు తప్పవని హెచ్చరించారు. 

ట్రంప్ వ్యాఖ్యలపై రష్యా అధ్యక్ష భవనం ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పందిస్తూ, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే ప్రయత్నాలు ఒక సుదీర్ఘ ప్రక్రియ అని అభివర్ణించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై నేరుగా స్పందించకుండానే, అమెరికా అధ్యక్షుడితో చర్చించడానికి పుతిన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని ఆయన స్పష్టం చేశారు. 

"ఉక్రెయిన్ విషయంలో కొన్ని ఆలోచనలు కార్యరూపం దాల్చుతున్నాయి. కానీ, ప్రకటన చేసేంతగా ఏమీ జరగలేదు. ఈ సమస్య చాలా సంక్లిష్టమైనది, కాబట్టి ఇది చాలా కాలం పట్టే ప్రక్రియ" అని పెస్కోవ్ పేర్కొన్నారు. అమెరికాతో చర్చల విషయంలో పుతిన్ ఎప్పుడూ అందుబాటులో ఉంటారని, ట్రంప్‌తో మాట్లాడేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని ఆయన నొక్కి చెప్పారు. 

Donald Trump
Putin
Zelensky
Russia-Ukraine War
NATO
US Politics
International Relations
Geopolitics
Ukraine Minerals
Dmitry Peskov
  • Loading...

More Telugu News