Rajasthan Royals: కోల్‌కతా రైడర్స్ విజయలక్ష్యం 152

- నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులు చేసిన రాజస్థాన్
- 33 పరుగులతో అదరగొట్టిన ధ్రువ్ జురెల్
- క్రీజులో నిలదొక్కుకోలేకపోయిన రియాగ్ పరాగ్
- రెండేసి వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు రాజస్థాన్ రాయల్స్ 152 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది.
మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ 28 బంతుల్లో 5 ఫోర్ల సహాయంతో 33 పరుగులు చేశాడు. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ 24 బంతుల్లో 29 పరుగులు, సంజు శాంసన్ 11 బంతుల్లో 13 పరుగులు చేశారు.
కెప్టెన్ రియాన్ పరాగ్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. అతను 15 బంతుల్లో 3 సిక్సర్లతో 25 పరుగులు చేశాడు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ, వైభవ్ ఆరోరా, హర్షిత్ రాణా తలో రెండు వికెట్లు పడగొట్టారు. స్పెన్సర్ జాన్సన్‌కు ఒక వికెట్ లభించింది.