Jr NTR: జపాన్ అభిమానుల ప్రేమకు తారక్ ఫిదా.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన హీరో!

- ఈ నెల 28న జపాన్‌లో గ్రాండ్‌గా విడుదలవుతున్న దేవర
- మూవీ ప్రమోషన్స్ కోసం అక్కడికి వెళ్లిన తారక్, కొరటాల
- ఈ క్రమంలో జపాన్ ఫ్యాన్స్‌తో ఉన్న వీడియో షేర్ చేసిన ఎన్‌టీఆర్
జూనియర్ ఎన్‌టీఆర్‌కు జపాన్‌లో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అక్కడ విడుదలైన తారక్ గత చిత్రాలు 'బాద్‌షా', 'ఆర్ఆర్ఆర్' మంచి వసూళ్లు సాధించాయి. ఈ నేపథ్యంలోనే 'దేవర' సినిమాను మేకర్స్ జపాన్‌లో ఈ నెల 28న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.
ఈ సందర్భంగా జపాన్ వెళ్లిన ఎన్‌టీఆర్, దర్శకుడు కొరటాల శివ.. జపాన్ అభిమానులను కలవడంతో పాటు అక్కడి స్థానిక మీడియాలలో 'దేవర' ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో జపాన్ అభిమానుల ప్రేమకు ఫిదా అయిన తారక్ తాజాగా వారితో ఉన్న ఒక వీడియోను తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా ద్వారా పంచుకున్నారు.
"మీ ప్రేమతో నా మనసు నిండిపోయింది. జపనీస్ ప్రేక్షకులు మార్చి 28 నుంచి సినిమా హాళ్లలో 'దేవర'ని అనుభవించడానికి నేను వేచి ఉండలేను" అంటూ రాసుకొచ్చారు. ఇక దేవర పార్టు 1 గతేడాది సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే దాదాపు రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ కూడా రాబట్టింది.