Chhava Movie: పార్లమెంట్ లో రేపు ఛావా సినిమా ప్రదర్శన

Chhava Movie to be Screened in Parliament

--


మరాఠా పోరాట యోధుడు, ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా డైరెక్టర్ ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ‘ఛావా’ చిత్రాన్ని రూపొందించిన విషయం విదితమే. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన ఈ చిత్రం హిందీతో పాటు పలు భాషల్లో విడుదలై దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. సుమారు 700 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాను పార్లమెంటులో ప్రదర్శించనున్నట్లు సమాచారం.

గురువారం ‘ఛావా’ సినిమా ప్రదర్శన ఉంటుందని, ఎంపీలందరూ తప్పకుండా హాజరుకావాలని ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమా కారణంగానే ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని ఇటీవల ఆందోళనలు జరిగాయని, నాగ్ పూర్ లో హింస చెలరేగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. మతపరమైన ఉద్రిక్తతలకు కారణమైనటువంటి సినిమాను పార్లమెంటులో ప్రదర్శించడమేంటని ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఛావా’ సినిమా ప్రదర్శనను ప్రతిపక్ష ఎంపీలు బాయ్ కాట్ చేయనున్నట్లు సమాచారం.

More Telugu News