'మ్యాడ్ స్క్వేర్' ట్రైలర్ వచ్చేసింది!
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ సీక్వెల్‌ను మరింత వినోదాత్మకంగా మలిచారు. దీంతో 'మ్యాడ్ స్క్వేర్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా యువత ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి భాగానికి బాణీలు అందించిన భీమ్స్ సిసిరోలియోనే రెండో పార్ట్‌కు కూడా సంగీతం అందిస్తున్నారు.