Mumbai Airport: ఎయిర్‌పోర్ట్ చెత్త‌బుట్ట‌లో శిశువు మృత‌దేహం

Infants Body Found in Mumbai Airport Trash Bin

  • ముంబ‌యిలోని ఛ‌త్ర‌ప‌తి శివాజీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో ఘ‌ట‌న
  • విమానాశ్ర‌యం టెర్మిన‌ల్-2లోని వాష్‌రూమ్ చెత్త‌బుట్ట‌లో శిశువు మృత‌దేహం
  • ఈ ఘ‌ట‌న‌తో ప్రయాణికులు, యాజ‌మాన్యం దిగ్భ్రాంతి

ముంబ‌యిలోని ఛ‌త్ర‌ప‌తి శివాజీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో అమాన‌వీయ ఘ‌ట‌న చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన న‌వ‌జాత శిశువు మృత‌దేహం బాత్‌రూమ్‌ చెత్త‌బుట్ట‌లో క‌నిపించింది. మంగ‌ళ‌వారం రాత్రి 10.30 గంట‌ల స‌మ‌యంలో ముంబ‌యి విమానాశ్ర‌యం టెర్మిన‌ల్-2లోని వాష్‌రూమ్ శుభ్రం చేస్తున్న స‌మ‌యంలో సిబ్బంది ఓ శిశువు మృత‌దేహాన్ని గుర్తించారు. దీంతో ప్రయాణికులు, యాజ‌మాన్యం దిగ్భ్రాంతికి గుర‌య్యారు. 

మృత‌దేహాన్ని పోస్టుమార్టం కోసం పంపి, గుర్తుతెలియ‌ని వ్య‌క్తుల‌పై కేసు న‌మోదు చేసిన‌ట్లు ముంబ‌యి పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి ఎవ‌రు పాల్ప‌డ్డార‌నే విష‌యాన్ని తెలుసుకోవ‌డానికి సీసీ కెమెరా దృశ్యాల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. చిన్నారిని హ‌త్య చేసి ఉంటారా? లేదా మృత‌శిశువు జ‌న్మించ‌డంతో చెత్త డ‌బ్బాలో ప‌డేసి వెళ్లారా? అనే కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

  • Loading...

More Telugu News