మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం
- మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ వ్యవహారంలో విచారణ జరుపుతున్న సీబీఐ
- రాయ్ పూర్, భిలాయ్ లోని భూపేశ్ భాఘెల్ నివాసాల్లో తనిఖీలు
- కాంగ్రెస్ పార్టీ నేతలు మరికొందరి ఇళ్లపైనా రెయిడ్
బాఘెల్ ఈ రోజు ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా సీబీఐ సోదాలు జరగడంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారని బాఘెల్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, సీబీఐ దాడులపై కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్ గఢ్ నేత సుశీల్ ఆనంద్ శుక్లా స్పందిస్తూ.. భూపేశ్ బాఘెల్ ను చూసి బీజేపీ భయపడుతోందని అన్నారు. కాంగ్రెస్ పంజాబ్ ఇన్ ఛార్జిగా బాఘెల్ నియామకం జరిగిన తర్వాత బీజేపీ పెద్దలకు భయం మొదలైందన్నారు. బాఘెల్ ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక విచారణ సంస్థలతో దాడులు చేయిస్తూ నిలువరించే ప్రయత్నం చేస్తోందన్నారు. తొలుత ఈడీ అధికారులను పంపిన కేంద్రం.. తాజాగా సీబీఐ అధికారులను బాఘెల్ నివాసానికి పంపిందన్నారు. అయితే, ఈ దాడులకు బాఘెల్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ భయపడబోదని శుక్లా స్పష్టం చేశారు.