Jr NTR: అర్ధాంగికి బర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోలను షేర్ చేసిన ఎన్‌టీఆర్

- నిన్న తారక్ అర్ధాంగి ప్రణతి పుట్టినరోజు
- “అమ్మలు... హ్యాపీ బర్త్‌డే” అంటూ ఇన్‌స్టా వేదికగా తారక్ పోస్ట్
- ఈ పోస్టుకు ప్రణతితో కలిసి ఉన్న రెండు ఫొటోలను జోడించిన వైనం
- సోషల్ మీడియాలో వైరలవుతున్న పిక్స్
జూనియర్ ఎన్‌టీఆర్ మంగళవారం తన అర్ధాంగి ప్రణతికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. “అమ్మలు... హ్యాపీ బర్త్‌డే” అని పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు ప్రణతితో కలిసి ఉన్న రెండు ఫొటోలను కూడా జోడించారు. ఈ జంట ప్రస్తుతం జపాన్‌లో ఉన్న విషయం తెలిసిందే. తారక్ చివరిగా నటించిన 'దేవర' చిత్రం మార్చి 28న జపాన్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ కోసం తన సతీమణితో కలిసి జపాన్ వెళ్లారు.
గత రెండు మూడు రోజులుగా అక్కడి వారితో కలిసి ఎన్‌టీఆర్ తెగ సందడి చేస్తున్నారు. అయితే, ప్రణతి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాత్రి జరిగిన వేడుకలకి సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ “అమ్మలు... హ్యాపీ బర్త్‌డే” అంటూ ప్రణతికి తారక్ బర్త్ డే విషెస్ తెలిపారు.
ఇప్పుడీ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో సతీమణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక తర్వలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ 'ఎన్‌టీఆర్ 31' చిత్రంలో జాయిన్ కానున్నారు. జపాన్ నుంచి వచ్చిన వెంటనే తారక్ ఈ చిత్ర షూటింగ్ మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది. అటు బాలీవుడ్‌లో ఎన్‌టీఆర్ ఎంట్రీ ఇస్తున్న 'వార్ 2' చిత్రం కూడా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.