KA Paul: 72 గంటల్లో వాళ్లంతా క్షమాపణ చెప్పాలి: కేఏ పాల్

KA Paul Demands Apology from Celebrities Promoting Betting Apps

  • బెట్టింగ్స్ యాప్స్ పై సుప్రీంకోర్టులో పిల్ వేశానన్న పాల్
  • బెట్టింగ్ యాప్స్ డ్రగ్స్ కంటే ప్రమాదకరమైనవని వ్యాఖ్య
  • యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు 72 గంటల్లో క్షమాపణ చెప్పాలన్న పాల్

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కలకలం రేపుతున్నాయి. పలువురు సెలబ్రిటీలపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ అంశంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందిస్తూ... బెట్టింగ్ యాప్స్ పై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశానని తెలిపారు. బెట్టింగ్ యాప్స్ డ్రగ్స్ కంటే ప్రమాదకరమైనవని... ఈ విషయాన్ని గతంలో తాను ఎన్నోసార్లు చెప్పానని అన్నారు. అప్పుడు తన మాటలను ఎవరూ పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు.

తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ పై బ్యాన్ ఉన్నప్పటికీ 978 మంది చనిపోయినట్టు అధికారిక గణాంకాలు చెపుతున్నాయని పాల్ తెలిపారు. ఈ యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు 72 గంటల్లో క్షమాపణ చెప్పాలని, నష్టపోయిన వారికి పరిహారం ఇప్పించాలని అన్నారు. 

ఇది బెదిరింపు కాదని... ఈడ్చుకెళ్తానని హెచ్చరించారు. సినీ నటులు, క్రీడాకారులు, సెలబ్రిటీలను యువత రోల్ మెడల్ గా తీసుకుంటుందని... కానీ, వారంతా సైతాన్లుగా మారారని... ఎంతో మంది చావులకు కారణమయ్యారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News